క్రీడాభూమి

యూఎస్ ఓపెన్ సెమీస్‌లో ఇద్దరు జపాన్ స్టార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 6: జపాన్‌కు చెందిన ఇద్దరు టెన్నిస్ స్టార్ ఆటగాళ్లు యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లి సంచలనం సృష్టించారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో కై నిషికొరి, నవోమ ఒసాకా తొలిసారిగా సెమీస్‌లో బెర్త్‌లు దక్కించుకోవడంతో జపాన్ మీడియా వీరిద్దర్నీ ఆకాశానికి ఎత్తేస్తోంది. ఒక గ్రాండ్ శ్లామ్ సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు చేరడం ఆషామాషీ కాదని వ్యాఖ్యానించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన క్రీడాకారిణి లెసియా సురెంకోను 6-1, 6-1 తేడాతో ఓడించి 20 ఏళ్ల ఒసాకా యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తొలిసారిగా చోటు దక్కించుకుంది. న్యూయార్క్‌లో జపాన్ క్రీడాకారిణి రికార్డు సృష్టించడం సంచలనం రేపుతోంది. సెమీఫైనల్స్‌లో ఒసాకా యూఎస్‌కు చెందిన మడిసన్ కీస్‌తో తలపడుతుంది. కాగా, జపాన్‌కు చెందిన కిమికొ డేట్ 1996 వింబుల్డన్ చాంపియన్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అదేవిధంగా పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన ఆటగాడు కై నిషికొరి (29) మరో దిగ్గజ ఆటగాడు మారిన్ సిలిస్‌ను 2-6, 6-4, 7-6(7/5) 4-6, 6-4తో ఓడించి సంచలనం సృష్టించి, ప్రత్యర్థిపై ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. సెమీఫైనల్స్‌లో నిషికొరి మరో దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్‌తో తలపడనున్నాడు. గత ఏడాది మణికట్టు గాయం కారణంగా యూఎస్ ఓపెన్‌లో ఆడలేకపోయిన నిషికొరి 2014లో అప్పటి వరల్డ్ నెంబర్ వన్ జొకోవిచ్‌ను సెమీఫైనల్స్‌లో ఓడించి ఫైనల్‌కు చేరిన తొలి ఆసియా దేశపు ఆటగాడిగా నిలిచాడు. కానీ ఇప్పటివరకు ఫైనల్‌లో గ్రాండ్ శ్లామ్‌ను గెలవలేకపోయాడు.

చిత్రాలు.. నవోమ ఒసాకా * కై నిషికొరి