క్రీడాభూమి

అలిస్టర్ కుక్ భావోద్వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 7: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న ఇంగ్లీష్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్ శుక్రవారం భావోద్వేగ క్షణాలు ఎదుర్కొన్నాడు. ఇంగ్లాండ్ కోసం చివరి మ్యాచ్ ఆడుతున్న కుక్, ఓపెనర్‌గా ఓవల్ మైదానంలోకి అడుగుపెట్టగానే అభిమానులు లేచి నిలబడి (స్టాండింగ్ ఓవేషన్) గౌరవాన్ని ప్రకటించారు. క్రీజ్‌లోకి వచ్చేవరకూ ఇంగ్లీష్ క్రికెట్‌కు కుక్ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కరతాళధ్వనులు చేశారు. క్రీజ్‌లోకి వస్తున్న కుక్‌కు ఎదురెళ్లిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మర్యాదపూర్వకంగా కరచాలనం చేశాడు. టీమిండియా గార్డ్ ఆఫ్ ఆనర్ ప్రకటించింది. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చివరి టెస్ట్ ఆడుతున్న 33 ఏళ్ల కుక్ తనకు లభించిన గౌరవంతో భావోద్వేగానికి గురయ్యాడు.