క్రీడాభూమి

ఇంగ్లాండ్ 198/7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 198 పరుగుల వద్ద ముగించింది. సిరీస్‌లో ఐదోసారీ టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా అంతర్జాతీయ క్రికెట్‌కు తాజా మ్యాచ్‌తో గుడ్‌బై చెబుతున్న అలిస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్ క్రీజులోకి వచ్చారు. తొలిరోజు 90 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 198 పరుగులు సాధించింది. 23 ఓవర్ల వరకూ వికెట్ కోల్పోకుండా నిలకడగా ఆడిన ఇంగ్లాండ్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చిన జెన్నింగ్స్ (23/75 బంతులు) వికెట్ కోల్పోయింది. 60 పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన మెయిన్ అలీ (50/170) సహకారంతో అలిస్టర్ కుక్ (71/190 బంతులు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆ తరువాత 40 ఓవర్ల వరకూ వికెట్ నష్టపోకుండా జో జట్టు జాగ్రత్తపడింది. 133 పరుగుల వద్ద బుమ్రాకు వికెట్ల ముందు అలిస్టర్ కుక్ దొరికిపోయాడు. వెంటనే జో రూట్, తరువాతి ఓవర్‌లో జానీ బెయిర్‌స్టోలు బుమ్రా, ఇషాంత్‌లకు దొరికేశారు. స్కోరు బోర్డు నెమ్మదించిన టైంలోనే బెన్ స్టోక్స్ (11/40 బంతుల్లో), శామ్ కుర్రన్ (డకౌట్)ల వికెట్లు పడిపోవడంతో ఇంగ్లీష్ జట్టు స్కోరు నిలిచిపోయింది. ఇన్నింగ్స్‌ను ఆదుకునేందుకు జాస్ బట్లర్ (11/31 బంతులు), ఆదిల్ రషీద్ (4/25 బంతులు) ప్రయత్నిస్తున్న సమయంలో ఓవర్లు పూర్తయ్యాయి. దీంతో 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇషాంత్ మూడు, బుమ్రా 2, జడేజా 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు.