క్రీడాభూమి

అంకుర్‌కు స్వర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంఘ్వాన్, సెప్టెంబర్ 8: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అప్రతిహతంగా పతకాల వేట కొనసాగిస్తున్నారు. పురుషుల డబుల్ ట్రాప్‌లో అంకుర్ మిట్టల్ ఫైనల్స్‌లో విజయం సాధించి భారత్ ఖాతాలో మరో పసిడిని చేర్చాడు.
అంకుర్ కెరీర్‌లో ఇదే అత్యన్నత విజయం కావడం గమనార్హం. మల్టిపుల్ వరల్డ్ కప్ టోర్నీలో పతకాన్ని సాధించిన అంకుర్, ఫైనల్ షూట్‌లో 150కి 140 పాయింట్లు సాధించాడు. చైనా షూటర్ యియాంగ్ యాంగ్, స్లోవేకియా షూటర్ హ్యుబెర్ట్ ఆండ్రెజ్‌లు సైతం సమ స్కోరు సాధించడంతో షూట్-ఆఫ్‌కు వెళ్లక తప్పలేదు. షూట్ ఆఫ్‌లో చైనా షూటర్ యియాంగ్ యంగ్‌పై 4-3 ఆధిక్యం సాధించడంతో అంకుర్ విజేతగా స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. యియాంగ్‌కు రజతం, రెండో రౌండ్‌లో విఫలమైన స్లొవేకియా షూటర్ ఆండ్రెజ్‌కు కాంస్య పతకాలు దక్కాయి. టీం ఈవెంట్‌లో భారత షూటర్లు ఎండి అసబ్, శార్దూల్ విహాన్‌లతో కలిసి అంకుర్ కాంస్య పతకాన్ని సాధించాడు. టీం ఈవెంట్‌లో 411 పాయింట్లతో ఇటలీ షూటర్లు స్వర్ణాన్ని, 410 పాయింట్లతో చైనా షూటర్లు రజతాన్ని దక్కించుకుంటే, 409 పాయింట్లతో భారత షూటర్లు కాంస్యం సాధించారు.
ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో ఇప్పటికే రజతాన్ని సొంతం చేసుకుని ఒలింపిక్ బెర్త్ ఖరారు చేసుకున్న అంజుమ్ వౌద్గిల్, మహిళల 50 మీటర్ల రైఫిల్ (త్రీ పొజిషన్స్) ఈవెంట్‌లో ఒక్కస్థానం వెనకబడి ఫైనల్స్‌కు అర్హత కోల్పోయింది. ఇక మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో పదో స్థానానికే పరిమితమైన మను బాకర్ సైతం ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ టోర్నీ ఏడోరోజు నాటికి భారత్ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్య పతకాలతో 20 పతకాలు సాధించింది.
పతకాల వేటలో తొలి మూడు స్థానాల్లో కొరియా, భారత్, చైనాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యద్భుత ప్రదర్శన కనబర్చిన భారత షూటర్లు ఇప్పటికే రెండు ఒలింపిక్ బెర్త్‌లు ఖాయం చేసుకోవడం గమనార్హం.