క్రీడాభూమి

అన్ని ఫార్మాట్లూ ఆడితేనే రాణింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 8: అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే టెస్ట్ మ్యాచ్‌లు ఒక్కటే సరిపోదని, అన్ని ఫార్మాట్లలోనూ రాటుదేలాలని స్పిన్నర్ రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో చివరి ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 57 పరుగులిచ్చి రెండు వికెట్లు తీయడం తెలిసిందే. ‘నా వరకూ దేశం కోసం క్రికెట్ ఆడటం గురించే ఆలోచిస్తా. ఏదో ఒక రోజు బాగా ఆడటం కాదు, అన్ని ఫార్మాట్లు ఆడగల క్రికెటర్‌గా రాణించడమే లక్ష్యం. ఏ చిన్న అవకాశం వచ్చినా సామర్థ్యం చూపించడానికి ప్రయత్నిస్తాం’ అని వ్యాఖ్యానించాడు. ‘ఒకే ఫార్మాట్ ఆడటానికి అలవాటుపడితే క్రికెటర్‌గా రాణించలేం. ఎందుకంటే మ్యాచ్‌ల మధ్య సమయాభావం ఎక్కువ ఉంటుంది. అంతర్జాతీయ వేదికలపై రాణించే అనుభవం సంపాదించుకోవాలంటే నిరంతరం క్రికెట్ ఆడుతుండాలి. అన్ని ఫార్మాట్లూ అలవాటు చేసుకోవాలి’ అన్నాడు. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ఏ చిన్న అవకాశం దక్కినా పూర్తి సామర్థ్యం ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తానని జడేజా చెప్పుకొచ్చాడు.