క్రీడాభూమి

అద్భుతం జరిగితే తప్ప ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్భుతం జరిగితే తప్ప ఐదో టెస్ట్‌లో టీమిండియా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. చివరి టెస్ట్ గెలుపుతోనైనా గౌరవప్రదమైన ఓటమి (3-2)తో వెనుతిరగవచ్చన్న కోహ్లీ సేన ఆశల్ని ఇంగ్లీష్ ఆటగాళ్లు నెరవేరనివ్వడం లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 198/7తో మలిరోజు బరిలోకి దిగిన జో జట్టు స్కోరును పరిగెత్తించింది. చివరి ఆటగాళ్లు చెలరేగిపోయి స్కోరు పరుగును 332వద్ద నిలపడంతో, టీమిండియా నీరుగారిపోయింది. ఊపిరి బిగబెట్టి ఛేదనకు దిగిన కోహ్లీ సేనను ఇంగ్లీష్ బౌలర్లు ముందుకు సాగనివ్వలేదు. మలిరోజు ఆట నిలిపివేసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించిన టీమిండియా, లక్ష్య సాధనకు 158 పరుగులు వెనుకబడి వుంది. నేటి ఆటలో టీమిండియా చివరి ఆటగాళ్లూ చెలరేగిపోతే తప్ప -ఇంగ్లీష్ జట్టు స్కోరుకు దగ్గర కావడం అసంభవమే. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో ఇప్పటికే కైవసం చేసుకున్న ఇంగ్లాండ్, గెలుపు స్థాయిని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.

చిత్రం..ఛతేశ్వర్ పూజారా వికెట్‌ను తీసిన ఆనందాన్ని జట్టు సభ్యులతో పంచుకుంటున్న జిమ్మి ఆండర్సన్