క్రీడాభూమి

డేవిస్‌కూ రఫా దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 9: మోకాలి గాయం కారణంగా యూఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ పోరునుంచి మధ్యలో తప్పుకున్న స్పానిష్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్, తాజాగా డేవిస్ కప్ సెమీఫైనల్స్ నుంచీ తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్పానిష్ టెన్నిస్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. వచ్చేవారం స్పెయిన్‌లో జరగనున్న డేవిస్ కప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్ ఆటగాడితో నాదల్ తలపడాల్సి ఉంది. ‘డేవిస్ కప్ సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్‌తో నాదల్ తలపడే స్థితిలో లేడు. యూఎస్ ఓపెన్‌లో మోకాలి గాయం తిరగబెట్టడంతో, డేవిస్ కప్ సెమీఫైనల్స్ నుంచీ తప్పుకుంటున్నాడు’ అని స్పెయిన్ టీం కెప్టెన్ సెర్జి బృగువేరా వెల్లడించాడు. ‘అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. డేవిస్ కప్‌లో స్పానిష్ జట్టుకు అతను అందించిన సహకారాన్ని మరువలేం’ అని పేర్కొన్నాడు. నాదల్ స్థానంలో 52వ ర్యాంకర్ ఆల్బెర్ట్ రామోస్ -వినోలాస్ ఆడతాడు.