క్రీడాభూమి

అంపైర్‌పై ఆండర్సన్ ఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 9: ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు ఫైన్ విధించారు. అంపైర్ కుమార్ ధర్మసేన పట్ల దురుసుగా ప్రవర్తించి క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన ఆండర్సన్ మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించారు. అంతేకాదు డిసిప్లినరీ రికార్డులో డీమెరిట్ పాయింట్ సైతం జోడించడం గమనార్హం. చివరిదైన ఐదో టెస్ట్ రెండోరోజు ఇండియా ఇన్నింగ్స్‌లో కోహ్లీకి బౌలింగ్ చేస్తూ, ఎల్బీడబ్య్లుకి అప్పీల్ చేశాడు. ధర్మసేన నాటౌట్ ప్రకటించడంతో అంపైర్‌పైకి దూకుడుగా వెళ్లి, దురుసుగా మాట్లాడాడు. థర్డ్ అంపైర్ సైతం ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించడంతో, అండర్సన్ అప్పీల్ విఫలమైంది. అయితే, తన తప్పును ఆండర్సన్ ఒప్పుకోవడంతో ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.1.5 కింద అతనిపై ఫైన్ విధించారు.