క్రీడాభూమి

సీవోఏ ముందుకు శాస్ర్తీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా వైఫల్యాలపై ప్రధాన కోచ్ రవిశాస్ర్తీని క్రికెట్ పాలక కమిటీ నివేదిక కోరే అవకాశం కనిపిస్తోంది. అది నేరుగానా? నివేదికరూపంలోనా? అన్నది తేలాల్సి ఉంది. ఇంగ్లాండ్‌తో వనే్డ, టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో, ప్రస్తుతం సాగుతోన్న ఐదో టెస్ట్ అనంతరం జట్టు సామర్థ్యంపై సీవోఏ ఒక అంచనాకు వచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ‘ఈ 11న ముంబయిలో సీవోఏ సమావేశం జరుగుతుంది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం అమలు, ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా సామర్థ్యం అంశాలు కచ్చితంగా చర్చకు వచ్చ అవకాశాలు ఉన్నాయి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘చీఫ్ కోచ్ రవిశాస్ర్తీని కలవమనైనా అనొచ్చు. లేదా రాతపూర్వకంగా నివేదిక ఇమ్మని అయినా కోరవచ్చు’ అని ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం క్రికెట్ సలహా సంఘం పనిచేయడం లేదు. బీసీసీఐ ఎన్నికలు జరిగే వరకూ సీవోఏదే బాధ్యత కనుక, జట్టు ఫాంపై నివేదిక తీసుకోవచ్చని ఆయన వెల్లడించారు. 11నాటి సమావేశంలో అవసరమైతే సెలెక్టర్ కమిటీ చైర్మన్ ఎంఎస్‌కె ప్రసాద్ అభిప్రాయాన్ని సైతం స్వీకరించే అవకాశం ఉందిని తెలుస్తోంది. ‘స్వదేశంలోనైనా, విదేశీ పర్యటనలోనైనా ఒక సిరీస్ పూరె్తైన తరువాత మేనేజర్ రిపోర్టు ఇవ్వడమన్నది గత 30ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. అయితే, ప్రస్తుత మేనేజర్ సునీల్ సుబ్రహ్మణం పూర్తిగా పాలక పరిస్థితులపై రిపోర్టు ఇస్తారే తప్ప, జట్టు సామర్థ్యంపై కాదు. క్రికెటింగ్ ఫీడ్‌బ్యాక్ ప్రధాన కోచ్, జట్టు కెప్టెన్, సెలెక్టర్ల కమిటీ చైర్మన్‌గాని ఇవ్వాల్సి ఉంటుంది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. చీఫ్ కోచ్ గ్రెగ్ చాపెల్ తరువాత ఇప్పటి వరకూ విదేశీ పర్యటనలపై ఏ కోచ్ కూడా సామర్థ్య నివేదిక అందించలేదు. వెన్ను నొప్పితో బాధపడుతున్నా భువీని మూడో వనే్డలో బలవంతంగా ఆడించారా? సౌతాంఫ్టన్ టెస్ట్ సమయానికి రవిచంద్రన్ అశ్విన్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడా? లాంటి అంశాలనూ టీం ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్ నుంచీ సీవోఏ నివేదిక తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.