క్రీడాభూమి

చాన్స్ వదులుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 10: ఐసీసీ మహిళా చాంపియన్‌షిప్ టోర్నీలో భాగంగా టీమిండియా మహిళా జట్టు నేటినుంచి 16 వరకూ శ్రీలంకలో పర్యటించనుంది. ఈ విషయాన్ని క్రికెట్ గవర్నింగ్ బాడీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2021లో అర్హత కోసం పాయింట్ల పట్టికలో కింది వరుసలోనున్న శ్రీలంక, భారత్, వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడుతున్నాయి. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2017 ఫైనలిస్ట్ అయిన భారత జట్టు ఇప్పటికి ఆరు మ్యాచ్‌లు ఆడి, నాలుగు పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. సౌతాఫ్రికాపై 2-1స్కోరుతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతోనే టీమిండియాకు ఈ పాయింట్లు లభించాయి. పాకిస్తాన్, వెస్టిండీస్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన శ్రీలంక ఒక పాయింట్ సంపాదించాల్సి ఉంది. తాజాగా సెప్టెంబర్ 11నుంచి 16 వరకూ ఆతిథ్య శ్రీలంకతో భారత్ ఆడబోయే సిరీస్ ఇరు జట్లకూ కీలకమే. డిఫెండింగ్ చాంపియన్స్ ఆస్ట్రేలియాతో ఆడిన సిరీస్‌లో పరాజయాన్ని మూటగట్టుకున్న భారత్, శ్రీలంకపై విజయం సాధిస్తే తన మునుపటి స్థానానికి చేరుకోగలుగుతుంది. అదే శ్రీలంక విజయం సాధిస్తే... పాక్, వెస్టిండీస్‌పై విఫలమైనా కావాల్సిన పాయింట్‌ను పదిలం చేసుకున్నట్టవుతుంది. సో.. రెండు జట్లకూ తాజా సిరీస్ కీలకమే. ‘పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానం కోసం మావంతు ప్రయత్నం మేం చేస్తాం. విజయం కోసం సమష్టిగా శక్తి, యుక్తులను ఉపయోగిస్తాం’ అని భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ వ్యాఖ్యానించింది. ‘సిరీస్ కోసం కఠిన సాధన చేశామని చెప్పుకొచ్చింది.