క్రీడాభూమి

పతనానికి రూటేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక ఓటమిని అంగీకరించడమే భారత్‌కు మిగిలింది. అసాధ్యమైన పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన ముందుపెట్టిన జో జట్టు.. ఐదో టెస్ట్‌నూ తన ఖాతాలో వేసుకుంది. సిరీస్‌కు ముందు స్వీప్ కబుర్లు చెప్పిన టీమిండియా.. ఒక్క టెస్ట్ విజయం (1-4)తో స్వీపైపోయింది. ఆటలో గెలుపోటములు సహజం కనుక.. వాళ్లు గెలిచారు అనేకంటే మేం ఓడాం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం భారత్‌కు మిగిలింది. మ్యాచ్ చివరి రోజు ఏడు వికెట్లతో 406 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడం... అద్భుతం జరిగితేనే సాధ్యం. అతి కష్టంపై మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా.. కోహ్లీ సేన ఓడినట్టే లెక్క. సో.. ఆడాల్సిన ఆసియా కప్‌లో మన ప్రతాపాలు, ప్రణాళికల గురించి మాట్లాడుకోవడం వినా, చేజారిన ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్‌ను పోస్టుమార్టం చేసుకోవడం.. ‘్ఫలితం లేని మ్యాచ్ ఆడటం లాంటిదే’!
*
లండన్, సెప్టెంబర్ 10: అలిస్టర్ కుక్ (147), జో రూట్ (125).. కోహ్లీ సేన గుండెల్లో బంతులు పరిగెత్తించారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదో టెస్ట్‌లో భారత్ పతనాన్ని పక్కాగా శాసించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చిట్టచివరి సెంచరీతో అలిస్టర్ కుక్ గ్రేట్ రిటైర్మెంట్ రుచిచూపిస్తే, 28 ఇన్నింగ్స్‌లో తొలి సెంచరీతో ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ టీమిండియాకు చుక్కలు చూపించాడు. చివరి టెస్ట్‌ను వన్‌సైడ్ చేసేసిన ఇంగ్లీష్ జట్టు.. సోమవారం టీ బ్రేక్ తరువాత మలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసేసింది. 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు సాధించిన జో జట్టు.. భారత్‌కు అసాధ్యమైన టార్గెట్‌ను ఇచ్చింది. వెంటనే మలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కేవలం 2 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయి ఐదో టెస్ట్‌పై పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. శిఖర్ ధావన్ ఒక్క పరుగుతోనే వెనుతిరిగితే, విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పూజారాలు డౌకట్లుగా పెవిలియన్‌కు చేరారు. లోకేష్ రాహుల్ (46), అజింక్య రహానె (10)తో క్రీజులో ఉన్నారు. 18 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి టీమిండియా 58 పరుగులు చేసింది. అపజయం అంచుల్లోవున్న టీమిండియా టెస్ట్‌లో నెగ్గాలంటే ఇంకా 406 పరుగులు సాధించాల్సి ఉంది. తొలుత రెండు వికెట్ల నష్టానికి రెండంకెల స్కోరు దాటని ఇంగ్లీష్ జట్టు, మూడో వికెట్ నష్టానికి మూడొందలకు చేరింది. అలుపెరుగని ఆటతో కుక్ చెలరేగితే, ఆ వేగానికి కెప్టెన్ జో రూట్ తోడవ్వడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. చెలరేగిన ఇద్దరు బ్యాట్స్‌మెన్లను నియంత్రించడం ఇషాంత్ శర్మ (మడమ నొప్పి కారణంగా) లేని భారత బౌలర్లకు సాధ్యం కాలేదు. 286 బంతులు ఆడిన కుక్ 14 బౌండరీలు బాదితే, అంతేవేగంతో రూట్ 190 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో స్కోరును పరిగెత్తించాడు. అరంగేట్రం ఆటగాడు హనుమ విహారి (2/24) అతి కష్టంపై కుక్, రూట్‌ను పెవిలియన్‌కు పంపే సమయానికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 77వ ఓవర్‌లో మహ్మద్ షమి (2-97) బంతికి 94 పరుగుల చేసిన రూట్ దొరికిపోవాల్సిందే. ఫస్ట్ స్లిప్‌లో ఛెతేశ్వర్ పూజారా క్యాచ్ మిస్ చేయడంతో సెకెండ్ లైఫ్ తీసుకున్న రూట్, ఇక వెనుతిరిగి చూడలేదు.
14వ టెస్ట్ సెంచరీ సాధించిన వెంటనే, అటాకింగ్ గేమ్‌తో 88వ ఓవర్‌కు ఇంగ్లాండ్ స్కోరును 300కు చేర్చాడు. 95వ ఓవర్‌లో విహారి బంతులకు రూట్, కుక్‌లు ఒకరివెంట ఒకరు దొరికిపోయారు. ఈ టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కుక్ పెవిలియన్‌ను చేరుతున్నపుడు ఓవల్ స్టేడియం స్టాండింగ్ ఓవేషన్‌తో గౌరవించింది. సెంచరీతో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టి, సెంచరీతో టెస్ట్ క్రికెట్ ముగించిన ఐదో ఆటగాడిగా కుక్ పెవిలియన్ చేరాడు. ఈ రికార్డు సాధించిన వాళ్లలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు రెగ్గీ డఫ్, బిల్ పాన్స్‌ఫోర్డ్, గ్రెగ్ చాపల్, భారత్ బ్యాట్స్‌మెన్ అజారుద్దీన్ తరువాత కుక్ కావడం గమనార్హం. భారత్‌పై ఏడు సెంచరీలు సాధించిన (కెవిన్ పీటర్సన్ ఆరు సెంచరీలు) ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌గానూ కుక్ రికార్డు నమోదు చేశాడు. పాంటింగ్ తరువాత టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కుక్ రికార్డు నిలుపుకున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 14 సెంచరీలు సాధించిన సంగక్కర రికార్డును అధిగమిస్తూ, 15 సెంచరీలతో కుక్ రికార్డు నెలకొల్పాడు. చిట్టచివరి ఇన్నింగ్స్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పి పెవిలియన్‌కు చేరుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ కుక్‌కు భారత ఆటగాళ్లు కరచాలనాలతో ఘనంగా అభినందన వీడ్కోలు పలికారు. తరువాతి ఓవర్లలోనే జానీ బెయిర్ స్టో (18)ను షమి పెవిలియన్‌కు పంపితే, జాస్ బట్లర్‌ను రవీంద్ర జడేజా (2-147) డకౌట్ చేయడంతో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసేసింది.