క్రీడాభూమి

‘ద్రోణాచార్య’ సారథిగా జస్టిస్ ముద్గల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: కోచ్‌లు, క్రీడాకారులకు భారత ప్రభుత్వం అందించే అత్యున్నత అవార్డులైన ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డులకు అర్హులను ఎంపిక చేసే కమిటీ బాధ్యతలను జస్టిస్ ముకుల్ ముద్గల్‌కు అప్పగించనున్నారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణను సుప్రీం కోర్టు అప్పట్లో ముకుల్ ముద్గల్‌కు అప్పగించడం తెలిసిందే. తాజాగా అత్యున్నత అవార్డులకు అర్హులను ఎంపిక చేసే కమిటీ నాయకత్వ బాధ్యతలనూ ముద్గల్‌కు క్రీడా మంత్రిత్వ శాఖ అప్పగించనుంది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ‘దీనిపై సెప్టెంబర్ 16న ఢిల్లీలో సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎంపిక కమిటీలో షూటర్ సమరేష్ జంగ్, షట్లర్ అశ్వినీ పొన్నప్ప, బాక్సింగ్ జాతీయ మాజీ కోచ్ జిఎస్ సంధు, హాకీ కోచ్ ఏకె బన్సల్, ఆర్చరీ కోచ్ సంజీవ సింగ్, స్పోర్ట్స్ అథారిటీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఓంకార్ కెడియా, సంయుక్త కార్యర్శి (స్పోర్ట్స్) ఇందర్ ధమిజలు ఉన్నారు. అలాగే, ఇద్దరు స్పోర్ట్స్ జర్నలిస్టులు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ సీఈవో కమాండర్ రాజేష్ రాజగోపాలన్ ఉన్నారు.

అర్జునకు అమిత్ పేరు నామినేషన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించిన భారత బాక్సర్ అమిత్ ఫంగల్ పేరును ఈ ఏడాది అర్జున అవార్డుకు భారత బాక్సింగ్ ఫెడరేషన్ ప్రతిపాదించింది. ఆసియా గేమ్స్ లైట్ ఫ్లైవెయిట్ (49 కేజీ) క్యాటగిరీలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఒలింపిక్ చాంపియన్ హసన్‌బోయ్ దుస్మతోవ్‌ను మట్టికరిపించి అమిత్ స్వర్ణాన్ని సాధించడం తెలిసిందే. అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించి భారత్‌కు మెడల్ సాధించిన అమిత్ పేరును ఈ సందర్భంగా ఫెడరేషన్ క్రీడల్లో అత్యున్నత అర్జున అవార్డుకు ప్రతిపాదించింది. బాక్సర్లుగా అనితర విజయాలు సాధిస్తున్న సోనియ లేదర్, గౌరవ్ బిధూరిలకు రెండో ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన ఖేల్ రత్నకు ఫెడరేషన్ ప్రతిపాదించింది. ‘అర్జునకు నా పేరు నామినేట్ చేయడమే అత్యున్నత గౌరవం. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. నేను సాధించిన పతకమే నా గురించి మాట్లాడుతుంది. భవిష్యత్‌లో నేను కోరుకునేది కూడా అదే’నని ఆసియా గేమ్స్‌లో స్వర్ణాన్ని సాధించిన 8వ బాక్సర్, 22 ఏళ్ల అమిత్ వ్యాఖ్యానించాడు. అయితే 2012 డోప్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో అమిత్‌ను అవార్డును అర్హుడిగా భావిస్తారా? లేదా? అన్న సందిగ్దం లేకపోలేదు.