క్రీడాభూమి

ఆశించిన అద్భుతాలు అందకున్నా....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశించిన అద్భుతాలు అందకున్నా, అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించింది టీమిండియా. ఓటమి నుంచి తప్పించుకునే అవకాశం లేకున్నా, గెలుపు కోసం అహరహం శ్రమించింది. మలి ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికి ఇంగ్లీష్ జట్టు 464 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచినపుడు -చివరి టెస్ట్‌లోనూ పరాభవం తప్పదన్న అంచనాలే. ముగింపుపై ఆశలు లేకుండానే బరిలోకి దిగిన కోహ్లీ సేన, ఒకదశలో గెలుపు అసాధ్యం కాదేమోనన్న ఆశలు రేకెత్తించింది. నిజానికి ఆడాల్సిన ఆటగాళ్లు ఆరంభంలోనే బ్యాట్లెత్తేసినా, ఇద్దరే ఇద్దరు ఇన్నింగ్స్‌ను భుజాన వేసుకున్నారు. స్కోరు బోర్డును కొలిక్కి తెచ్చారు. సిరీస్ మొత్తంమీద ఇంతవరకూ అర్ధ శతకానే్న నమోదు చేయని కెఎస్ రాహుల్ చివరి టెస్ట్‌లో ఇంగ్లీష్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 147 పరుగులు సాధించి లక్ష్య సాధనవైపు భారత్‌ను తీసుకెళ్లాడు. ఇక గురువును మించిన కీపర్‌గా రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో భారత్ స్కోరును గౌరవప్రద స్థానంలో నిలిపాడు. తొలి పరుగును సిక్సర్‌తో మొదలెట్టి, తొలి సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేసిన పంత్, అనూహ్య ఆటతో ముగింపులో మెరుపులు మెరిపించాడు. 300 పరుగులు దాటేసిన టీమిండియా స్కోరు 400లకు చేరడం కష్టం కాదనుకునే సమయానికి కీలక వికెట్లు కుప్పకూలాయ. ఆట మొత్తం మారిపోయింది. చివరి వికెట్లను టపటపా రాల్చేసిన ఇగ్లీష్ బౌలర్లు ఐదో టెస్టునూ తమ ఖాతాలో వేసుకున్నారు. 4-1తో సిరీస్ విజేతలుగా నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలిస్టర్ కుకు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (ఇంగ్లాండ్) శామ్ కుర్రన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (ఇండియా) విరాట్ కోహ్లీ దక్కించుకున్నారు.

చిత్రం: సెంచరీ వీరులు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
====