క్రీడాభూమి

కూతకొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ప్రో కబడ్డీ ఊరిస్తోంది. తొడగొట్టి ప్రత్యర్థిని చిత్తుచేసి వీర ప్రతాపాన్ని ప్రదర్శించే ఆట వచ్చె నెల నుంచే మొదలవుతోంది. దీనికి సంకేతంగా ఇప్పటికే విడుదల చేసిన ప్రచార గీతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమై నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రదీప్ నర్వాల్, అనూప్‌కుమార్, మోను గోయల్, రిషాంక్‌లు మ్యాచ్‌ల కోసం ఎలా సన్నద్ధమవుతున్నారో చూపిస్తూ ప్రచార గీతాన్ని రూపొందించారు. నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు విస్తృత ఆదరణకు నోచుకోవడం తెలిసిందే. సంప్రదాయాక క్రీడకు అంతర్జాతీయ ప్రాముఖ్యత లభించడంతో, తరువాతి సీజన్ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ లేకపోలేదు. ఈ తరుణంలో ఆరో సీజన్ ప్రో కబడ్డీని డిజైన్ చేసి, మ్యాచ్‌ల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 5నుంచి ఆరంభమవుతున్న ప్రో కబడ్డీ కూత వచ్చే ఏడాది జనవరి 5 వరకూ సాగనుంది. అంటే 13 వారాలపాటు కబడ్డీ ప్రేమికులకు పండగే పండగన్న మాట.