క్రీడాభూమి

అయనా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 12: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా, పది పాయింట్లు నష్టపోయినా ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అగ్రస్థానంలోనే నిలిచింది. ఇక సిరీస్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ప్రదర్శన చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్‌ను వెనక్కినెట్టి టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు. సిరీస్ మొత్తంమీద కోహ్లీ 593 పరుగులు చేయడం తెలిసిందే. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తరువాతి స్థానంలో 27 పాయింట్లతో వున్న కోహ్లీ, సిరీస్ పూర్తయ్యేసరికి ఒక పాయింట్ అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. ఇక ఇంగ్లాండ్‌తో సిరీస్ మొదలుపెట్టే సమయానికి భారత్ పాయింట్లు 125. చివరిదైన ఓవల్ టెస్ట్‌లో 118 పరుగుల తేడాతో ఓడిపోయి, 1-4 స్కోరుతో సిరీస్‌ను కోల్పోవడంతో పది పాయింట్లు నష్టపోయి 115 పాయింట్లకు చేరింది. అయితే దరిదాపుల్లో ఏ జట్టూ లేకపోవడంతో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. 106 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో దక్షిణాఫ్రియా, ఆస్ట్రేలియా జట్లు కొనసాగుతున్నాయి. 97 పాయింట్లతో ఐదో స్థానంలోవున్న ఇంగ్లాండ్ జట్టు, భారత్‌తో సిరీస్ విజయంతో ఎనిమిది పాయింట్లు సాధించి 105 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో ఇంగ్లాండ్ ఒకే పాయింట్ వెనుకపడి ఉంది. నాలుగోస్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఐదో స్థానానికి చేరినా, 102 పాయింట్లతో పైవరుసలోని జట్లకు సమీపంలోనే ఉండటం గమనార్హం. టెస్ట్ బౌలర్స్ ర్యాంకుల్లో టాపర్‌గా జేమ్స్ ఆండర్సన్ తన స్థానాన్ని కొనసాగిస్తున్నాడు.