క్రీడాభూమి

కోహ్లీగా గెలిచాడు - కెప్టెన్‌గా ఓడాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అప్పుడు భయపడ్డాడు. ఇప్పుడు భయపెట్టాడు. ఇంగ్లాండ్ టూర్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌గా స్కిప్పర్ కోహ్లీ సక్సెస్. కాకపోతే కెప్టెన్సీ విషయంలోనే.. సారథ్య సామర్థ్య పరిణితి చూపించలేకపోయాడు. 2014 సిరీస్‌లో ఇంగ్లీషోళ్లు చూసిన కోహ్లీకి, తాజా సిరీస్‌లో కనిపించిన విరాట్ కోహ్లీకి తేడా ఏమిటో.. 593లో ఏ పరుగునడిగినా చెబుతుంది. సారథిగా అప్పటికి ఇప్పటికీ ఎక్కడున్నాడంటే.. 1-4 సిరీస్ స్కోరే కనిపిస్తుంది. లార్డ్స్ టెస్ట్ తరువాత -‘టీమిండియా ఆడలేకపోయింది. ఇంగ్లాండ్ బెటర్ క్రికెట్ ఆడింది’ అన్న కోహ్లీ వ్యాఖ్యలే ఈ సమీక్షకు సరైన సమాధానం కాకపోదు. నిజానికి జట్టుకు అతనే సైన్యం. అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్. ఇంగ్లీష్ టెస్ట్ ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు, మరో రెండు అర్థ శతకాలతో 593 పరుగులు సాధించాడు. అనుభవంతో ఆరితేరిన జిమీ ఆండర్సన్‌లాంటి ఆటగాళ్లను సమర్థంగా నిలువరించాడు. బ్యాట్స్‌మెన్‌గా పరిణితి చూపించిన కోహ్లీ, సారథిగా జట్టులో అంతటి స్ఫూర్తి నింపడంలో విఫలమయ్యాడు. 299 పరుగులతో ద్వితీయ స్థానంలో నిలిచిన కెఎల్ రాహుల్, చివరి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు సాధించాడు. ఇలా అవసరమైన సందర్భాల్లో అంతటి కసిని జట్టు మొత్తం చూపించివుంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేదే. సన్నద్ధత లోపం
ఇంగ్లీష్ కండిషన్లకు వీలుగా కోహ్లీ టెక్నికల్‌గా తనను తాను మార్చుకున్నాడు. మానసికంగా జట్టును సిద్ధం చేయడంలో మాత్రం విఫలమయ్యాడు. వనే్డ సిరీస్, టెస్ట్ సిరీస్‌కి మధ్య కనీసం రెండు సన్నాహాక మ్యాచ్‌లు ఆడి ఉండాల్సిందంటూ గవాస్కర్‌లాంటి క్రికెట్ విజ్ఞులు చేసిన సూచనలను సీరియస్‌గా తీసుకుని ఉంటే బావుండేది. ‘కోహ్లీలాంటి ఆటగాడికి ప్రాక్టీస్ మ్యాచ్‌లతో పనిలేకపోవచ్చు. నెల రోజులపాటు క్రికెట్‌కు దూరంగావున్నా, అతను క్రీజులోకి దిగిన వెంటనే గేమ్‌లోకి రాగలడు. కానీ, మిగిలిన వాళ్లకు ప్రాక్టీస్ అవసరం. సన్నాహక మ్యాచ్‌ల్లో టెస్ట్ క్రికెట్‌లాంటి పోరాటం కనిపించకపోవచ్చు. కానీ, బ్యాట్స్‌మెన్, బౌలర్లకు పరిస్థితులపై అవగాహన వస్తుంది. మాటలకంటే సన్నాహక ఆటలే బెటర్’ అన్న గవాస్కర్ వ్యాఖ్యల్ని టీమిండియా ఎప్పటికీ సీరియస్‌గానే తీసుకుంటే మంచిది.
జట్టు ఎంపికలోనూ కోహ్లీ ఏకపక్ష ధోరణి కొంపముంచింది. చాలాకాలంగా ఇంగ్లీష్ కౌంటీలకు అలవాటుపడిన ఛెతేశ్వర్‌ను, ఫాంలో లేడన్న సాకుతో పక్కన పెట్టడం. కానీ, టీమిండియా గెలిచిన ఒకే ఒక్క టెస్ట్ -ట్రెంట్ బ్రిడ్జిలో. ఆ మ్యాచ్‌లో ఛెతేశ్వర్ పూజారా సెంచరీయే భారత్‌కు విజయాన్నిచ్చింది. టీమిండియా టెస్ట్ క్రికెట్‌కు నయావాల్‌గా మారిన ఛెతేశ్వర్‌కు అవకాశం కల్పించకుండా, శిఖర్‌ధావన్‌పై నమ్మకం పెట్టుకోవడం పెద్ద పొరబాటే. సౌతాఫ్రికా టూర్ నుంచీ టాప్‌ఆర్డర్ టెక్నిక్‌కు దూరమైన శిఖర్, సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపైనా కోహ్లీ అతి నమ్మకం పెట్టుకోవడం కొంపముంచింది. ట్రెంట్ బ్రిడ్జి టెస్ట్‌లో ఐదు వికెట్లు తీయడం, సాధించిన అర్థ శతకం వినా హార్దిక్ మెరుపులేవీ లేవు. అదే ప్రత్యర్థి జట్టులో కుర్ర ఆల్‌రౌండర్ శామ్ కుర్రన్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. భారత్ బౌలర్లను విసిగించాడు. ఎడ్జ్‌బాస్టస్, సౌతాంఫ్టన్ టెస్టుల గెలుపులో శామ్‌కుర్రన్‌తో కీలక పాత్ర. ఆరో బ్యాట్స్‌మెన్‌గా దిగాల్సినంత అనుభవం, స్థాయి హార్దిక్‌కు లేదన్నది ఈ సిరీస్‌తో అర్థమైనట్టే.
ఇక కాలం, అదృష్టం రెండూ కూడా కోహ్లీకి కలిసి రాలేదు. ఇంగ్లాండ్ సమ్మర్‌లో వర్షాలు ఇబ్బందిపెడితే, ఐదుసార్లు టాస్ ఒడిపోవడమూ అవకాశాలను దూరం చేసింది. ఇంగ్లీష్ పిచ్‌లను అంచనా వేసి ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలోనూ వైఫల్యమే కనిపించింది. టర్న్, బౌన్స్‌కు సహకరించిన ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో స్పిన్నర్‌ను తీసుకోలేదు. చల్లటి వాతావరణంతో సీమర్లకు అనుకూలించే లార్డ్స్ పిచ్‌పై రెండో స్పిన్నర్‌ను తీసుకున్నాడు. ప్రత్యర్థి స్పిన్నర్లు చెలరేగిన సౌతాంఫ్టన్‌లో అశ్విన్‌ను ఆడించడం మరో పొరబాటు. ఆ టైంలో రవీంద్ర జడేజాకు కలిసొచ్చి ఉండేదన్నది సీనియర్ల మాట. ఇలా పిచ్‌లను అంచనా వేసి ఆటగాళ్ల ఎంపికలో జరిగిన పొరబాట్లూ ఓటమికి దారితీశాయి. ఇషాంత్ శర్మ (18), జస్ప్రీత్ బుమ్రా (16), మహ్మద్ షమి (14)లు సరైన ఫాంనే ప్రదర్శించినా, టెయిలెండర్లను నియంత్రించడంలో విఫలం కావడమూ కొంపముంచింది. కర్ణుడి చావుకి కారణాలు అనేక అన్నట్టు -టీమిండియా ఓటమికి సారథ్యంవైపు సాగిన వైఫల్యాలెన్నో. బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ ఒకే. కెప్టెన్‌గా...?