క్రీడాభూమి

.శ్రీకాంత్ అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, సెప్టెంబర్ 14: జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఓటమితో భారతపర్వం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెవెన్త్ సీడ్ శ్రీకాంత్, 33వ ర్యాంకర్, కొరియా షట్లర్ లీ డాంగ్ కెవున్‌తో తలపడి 21-19, 16-21, 18-21 స్కోరుతో ఓటమి చవిచూశాడు. 79 నిమిషాలపాటు సాగిన హోరాహోరీ పోరులో అటాకింగ్ గేమ్‌తో తొలి సెట్‌ను శ్రీకాంత్ కైవసం చేసుకున్నా, మిగిలిన రెండు సెట్లలోనూ ప్రత్యర్థి ఆటగాడు లీ డాంగ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. 2016 ఆసియా చాంపియన్‌షిప్ టోర్నీలో లీ డాంగ్ చేతిలో ఓటమి చవిచూసిన శ్రీకాంత్‌కు ఇది రెండో ఓటమి. శ్రీకాంత్ నిష్క్రమణతో టోర్నీలో భారత్ పర్వం ముగిసింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్ రౌండ్లలోనే ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు, స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్‌లు ఓటములతో టోర్నీనుంచి నిష్క్రమించడం తెలిసిందే. పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లోనూ మను అత్రి, బి సుమీత్ రెడ్డిలు రాణించలేకపోయారు.