క్రీడాభూమి

టీమిండియాకుఅగ్నిపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 14: ఇంగ్లీష్ గడ్డపై పేలవమైన ఆటతో నొప్పించిన టీమిండియా, సౌదీ మైదానాల్లో ఆసియా కప్ కోసం ప్రదర్శించబోయే ప్రతాపాలు ఏతీరున ఉంటాయోనన్న ఉత్కంఠ క్రికెట్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికితోడు కనీసం రెండుసార్లు తలపడనున్న దాయాది దేశాలు భారత్-పాక్‌ల పోరు ఆసక్తి రేకెత్తించేదే. దుబాయ్ వేదికగా నేటినుంచి ఆసియా కప్ క్రికెట్ సమరం మొదలవుతుంది. గ్రూప్-ఏ ప్రారంభ మ్యాచ్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడతాయి. టోర్నీలో క్రికెట్ ప్రపంచం కళ్లు పెద్దవి చేసి చూసే భారత్- పాక్‌లు ఖాయంగా రెండుసార్లు తలపడతాయి. గ్రూప్ లీగ్‌లో ఒకసారి, సూపర్ ఫోర్ కోసం మరోసారి దాయాది దేశాలు తలపడటం ఖాయం. నిర్వాహకులు, ప్రసార సాధకులు, అభిమానుల అంచనాలు నిజమైతే సెప్టెంబర్ 28నా భారత్-పాక్‌లు తలపడే అవకాశం లేకపోలేదు. ఇదిలావుంటే, ఆసియా కప్ కోసం టీమిండియా ఆటగాళ్లు కొందరు ఇప్పటికే దుబాయ్‌లో అడుగుపెట్టారు. ఇంగ్లాండ్ టూర్ నుంచి మరికొందరు ఆటగాళ్లు ఆదివారానికి చేరతారు.
వరుసగా మూడు ఫార్మాట్లతో అలిసిపోయిన కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినివ్వడంతో, అచ్చొచ్చిన రిలీవర్ సారథి రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. భారత్ విజయావకాశాలపై అభిమానుల్లో ఆశలైతే చావలేదుగానీ, పరుగుల యంత్రం కోహ్లీ లేకపోవడం, ఇంగ్లాండ్ సిరీస్‌లో పేలవమైన ఆటతీరు చూశాక జట్టు ప్రతాపంపై ఒకింత అపనమ్మకమూ లేకపోలేదు. సెప్టెంబర్ 18న తొలి మ్యాచ్‌గా హాంకాంగ్‌తో ఆడనున్న భారత్, మరుసటి రోజు 19న దాయాది పాక్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. కోహ్లీలేకున్నా, వైట్ బాల్ ప్లేలో వ్యూహాత్మక ప్రణాళిక రచించగల రోహిత్ శర్మ సామర్థ్యానికి ఈ టోర్నీ ఓ పరీక్షలాంటిదే. గత డిసెంబర్‌లో శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ విజయ సారథ్యం వహించినప్పటికీ, ప్రత్యర్థులు అంతబలమైన స్థితిలో లేరు. 50 ఓవర్ల ఫార్మాట్లో ప్రస్తుతం లంకకంటే బంగ్లాదేశే బలంగా ఉంది. ప్రపంచ మేటి జట్టుగా టీమిండియా ఈ అవరోధాలను అధిగమించినా, వచ్చే చిక్కల్లా పాక్‌తోనే. సీమర్ మొహ్మద్ అమీర్, ఆల్‌రౌండర్ హసన్ అలి, దిగ్గజ ఓపెనర్ ఫకర్ జమాన్, సమర్థ బ్యాట్స్‌మెన్లు బాబర్ అజమ్, హారిస్ సొహైల్‌తో దిట్టంగా కనిపిస్తున్న పాక్‌ను నిలువరించడం భారత్‌కు అంత సులువు కాకపోవచ్చు. ఇక టీమిండియా ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన విషయాలు రెండు. ఒకటి బలమైన మిడిలార్డర్‌ను ఎంపిక చేయడం, రెండోది మహేంద్ర సింగ్ ధోనీకి సరైన బ్యాటింగ్ పొజిషన్ కల్పించడం. కొద్దికాలంగా ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తోంది. బంగ్లాదేశ్ గడ్డపై సాగిన గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించడమే కాదు, టీ-20 ఫార్మాట్‌లోనూ అద్భుతంగా రాణించారు. 2012లో వనే్డ ఫార్మాట్‌లో ఫైనల్‌కు చేరుకున్నారు. బంగ్లా జట్టులో మాష్ఫ్రె మార్టజా బౌలింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తుంటే, తమీమ్ ఇక్బాల్, మహ్మదుల్లా రియాద్‌ల బ్యాటింగ్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఫామ్‌లోవున్న ఆటగాళ్లు ముష్‌ఫికర్ రహీమ్, షకీప్ అల్ హసన్‌తో బంగ్లా జట్టు టోర్నమెంట్‌లోకి డార్క్ హార్స్ హోదాలోనే దిగుతోంది. ఇక శ్రీలంక జట్టు మాత్రం ఒకపక్క పాలక బోర్డులో అంతర్గత విభేదాలు, గాయాలపాలైన ట్రబుల్ షూట్ ఆటగాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఎంతో అనుభవమున్న ఏంజిలో మాథ్యూస్, ఉపుల్ తరంగ, తిసార పెరీరా, లాంసిత్ మలింగ, యువరక్తం ఆటగాళ్లు అఖిల ధనన్జయ, దాసున్ షనక, కసున్ రజితలతో ఆసియా కప్‌లో ప్రతాపాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. చరిత్రను తిరగరాయాలన్న కసితో ఆఫ్గనిస్తాన్, హాంకాంగ్ జట్లూ బరిలోకి దిగుతున్నాయి. అయితే, టోర్నీలో విజయంకంటే వనే్డ స్టేటస్ పొందడానికే ఈ జట్లు పరిమితం కావొచ్చు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్.