క్రీడాభూమి

పెర్ఫెక్ట్ కాంబినేషన్‌కు అవకాశమిచ్చేదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: ఆరు దేశాలు ఆడుతున్న ఆసియా కప్ టోర్నీ వచ్చే వరల్డ్ కప్‌లో భారత్ ‘పెర్ఫెక్ట్ కాంబినేషన్’కు ఉపకరిస్తుందని టీమిండియా స్కిప్పర్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. వనే్డ మ్యాచ్‌లకు సంబంధించి భారత్ ఇప్పటికీ సరైన మిడిలార్డర్‌ను సెట్ చేసుకోలేక ఇబ్బంది పడుతోంది. ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్ కప్‌కు బలమైన జట్టు నిర్మాణానికి ఆసియా కప్ టోర్నీ ఉపకరిస్తుందా? అన్న ప్రశ్నకు ‘ఒకవిధంగా అలా అనుకోవచ్చు. ఎవ్వరైనా బలమైన జట్టుతోనే ప్రపంచ కప్ టోర్నీకి వెళ్లాలనుకుంటారు. మీరన్నట్టు ఆసియా కప్‌లో ఆడుతున్న జట్లుకు ‘వరల్డ్ కప్ టీం’ను సెట్ చేసుకునే అవకాశం లభిస్తున్నట్టే’నని అన్నాడు. ‘ప్రపంచ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. ఈలోగా ఎన్నో మ్యాచ్‌లు జరుగుతాయి. చాలామంది ఆటగాళ్లకు అవకాశాలు రావొచ్చు. వచ్చిన అవకాశాన్ని ఎందరో సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పటికి ప్రపంచ కప్ జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం’ అన్నాడు. ఆసియా కప్‌లో ఆసక్తి రేకెత్తిస్తోన్న భారత్ -పాక్ పోరుపై వ్యాఖ్యానిస్తూ ‘పాక్ క్రికెట్‌ను తక్కువ అంచనా వేయలేమన్న విషయాన్ని వాళ్ల గతం చూసి చెప్పొచ్చు. ఇప్పుడు మేంమాత్రం వాళ్లతో పోరాటంవైపే చూస్తున్నాం’ అన్నాడు.