క్రీడాభూమి

కోహ్లీ.. ఖేల్ రత్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డు కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రపంచ చాంపియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుల పేర్లను సంయుక్తంగా ప్రతిపాదించారు. అత్యంత ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు కోసం జాతీయ ఆర్చరీ బృందం కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజ, ట్రిపుల్ జంప్‌లో ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అర్పిందర్ సింగ్ కోచ్ ఎస్‌ఎస్ పన్ను పేర్లను ప్రతిపాదించారు. ద్రోణాచార్య అవార్డుకు 34ఏళ్ల వయసులోనే తేజ అర్హత సంపాదించడం గమనార్హం. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రతిపాదన జాబితాలో సీఎ కుట్టప్ప (బాక్సింగ్), విజయ్ శర్మ (వెయిట్ లిఫ్టింగ్), ఎ శ్రీనివాస రావు (టేబుల్ టెన్నిస్) పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి. ఇదిలావుంటే, ద్రోణాచార్య అవార్డు లైఫ్‌టైం క్యాటగిరీ కింద కోచ్‌లు క్లియరెన్స్ లాబో (హాకీ), తారక్ సిన్హా (క్రికెట్), జీవన్ కుమార్ శర్మ (జూడో), వీఆర్ బీడు (అథ్లెటిక్స్) పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ధ్యాన్‌చంద్ పేరిట ఇచ్చే అవార్డుల కోసం సత్యదేవ్ ప్రసాద్ (ఆర్చరీ), భారత్ చెత్రి (హాకీ), బాబీ అలోయ్‌సియస్ (అథ్లెటిక్స్), చౌగలె దాడు దత్తాత్రేయ (రెజ్లింగ్) పేర్లను ఎంపిక కమిటీ ప్రతిపాదించింది. ప్రఖ్యాత అర్జున అవార్డు కోసం జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా సహా 20మంది అథ్లెట్ల పేర్లను ప్రతిపాదించారు. వీరిలో జానియర్ ప్రపంచ చాంపియన్ స్ప్రింటర్ హిమదాస్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన పరుగుల వీరుడు జిన్సన్ జాన్సన్, క్రికెటర్ స్మృతి మంథాన, హాకీ ఆటగాళ్లు మన్‌ప్రీత్ సింగ్, సవితా పునియా, మల్టిపుల్ కామనె్వల్త్ గేమ్స్ స్వర్ణపతక విజేత మనీకా బాత్రా, ఆసియా గేమ్స్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన రోహన్ బొపన్న సైతం ఉన్నారు. ప్రతిపాదనలకు కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ ఆమోదముద్ర పడాల్సి ఉంది. దస్త్రంపై మంత్రి సంతకం అయితే, సెప్టెంబర్ 25న రాష్టప్రతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా క్రీడాకారులు అవార్డులను అందుకుంటారు. ప్రతిపాదిత పేర్లను యథాతథంగా క్రీడామంత్రిత్వ శాఖ ఖరారు చేస్తే, ఖేల్త్న్ర అందుకునే క్రికెటర్లలో కోహ్లీ (1997లో సచిన్ టెండూల్కర్, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ) మూడోవాడు అవుతాడు. ‘ఔను, ఖేల్త్న్ర అవార్డుల కోసం విరాట్ కోహ్లీ, మీరాబాయ్ చాను పేర్లును అవార్డుల ఎంపిక కమిటీ సంయుక్తంగా ప్రతిపాదించింది’ అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు స్పష్టం చేశారు. బాడ్మింటన్ సూపర్ సిరీస్ సర్క్యూట్‌లో అత్యద్భుత ప్రదర్శన చేసిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన బాక్సర్ అమిత్ ఫంగల్ పేర్లు సైతం ఖేల్త్న్ర పరిశీలనకు వచ్చినా చివరికి చాను పేరే ఖరారైంది. స్టార్ షూటర్లు రాహి సర్నోబాత్, అంకుర్ మిట్టల్, శ్రేయసి సింగ్‌లతోపాటు స్పోర్ట్స్ పర్సన్స్ అంకుర్ ధామ, మనోజ్ సర్కార్ పేర్లు సైతం అర్జున ప్రతిపాదిత జాబితాలో ఉన్నాయి. జకర్తాలో ఆసియా గేమ్స్ షెడ్యూల్ కారణంగా జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 19న నిర్వహించాల్సిన అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25కు మార్చడం తెలిసిందే. ఖేల్త్న్ర అవార్డు విజేతలకు 7.5 లక్షలు, అర్జున అవార్డీలకు రూ. 5లక్షలు నగదు బహుమతి అందిస్తారు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తిరుగులేని ఆటగాడిగా అగ్రపథాన నిలిస్తోన్న విరాట్ కోహ్లీని ఖేల్త్న్ర కోసం 2016-17లోనే పరిశీలించినా, అప్పట్లో ఎంపిక కమిటీ కోహ్లీ పేరును పక్కనపెట్టింది. గత మూడేళ్లుగా కోహ్లీ పేరును బీసీసీఐ ప్రతిపాదిస్తున్నా, 2016లో ఖేల్త్న్ర అవార్డును రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రావీణ్యం ప్రదర్శించిన సాక్షి మాలిక్, పీవీ సింధు, దీపా కర్మాకర్‌కు ప్రకటించారు. గత ఏడాది అవార్డు కోసం హాకీ మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్, అథ్లెట్ దేవేంద్ర ఝజారియాలను ఎంపిక చేశారు. ఇదిలావుంటే, ఖేల్త్న్ర కంటే ముందు పద్మశ్రీ అవార్డు అందుకున్న అరుదైన ఆటగాడిగా కోహ్లీ పేరు నిలిచిపోనుంది.
అర్జున అవార్డుకు ప్రతిపాదనలు: నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో), జిన్సన్ జాన్సన్ (అథ్లెటిక్స్), హిమదాస్ (అథ్లెటిక్స్), ఎన్ సిక్కిరెడ్డి (బాడ్మింటన్), సతీష్ కుమార్ (బాక్సింగ్), స్మృతి మంథాన (క్రికెట్), శుభాంకర్ శర్మ (గోల్ఫ్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), సవిత (హాకీ), రవి రాథోడ్ (పోలో), రాహి సర్నబాత్ (షూటింగ్), అంకుర్ మిట్టల్ (షూటింగ్), శ్రేయసి సింగ్ (షూటింగ్), మనీకా బాత్రా (టేబుల్ టెన్నిస్), జి సతియాన్ (టేబుల్ టెన్నిస్), రోహన్ బొప్పన్న (టేబుల్ టెన్నిస్), సుమిత్ (రెజ్లింగ్), పూజ కడియాన్ (వుషు), అంకుర్ ధామా (పారా అథ్లెటిక్స్), మనోజ్ సర్కార్ (పారా బాడ్మింటన్).

చిత్రాలు.. విరాట్ కోహ్లీ, తారక్ సిన్హా, నీరజ్ చోప్రా