క్రీడాభూమి

సీనియర్ ఆటగాళ్లు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఈ ఏడాది నవంబర్ 1 నుంచి జరిగే వెయిట్‌లిఫ్టింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌కు పలువురు సీనియర్ ఆటగాళ్లతోపాటు డిఫెండింగ్ చాంపియన్ మీరాబాయి చాను, సతీష్ శివలింగం, వెంకట్ రాహుల్ రాగాల ప్రాతినిధ్యం వహించే అవకాశం లేదు. అస్ఘబాట్, టర్క్‌మెనిస్తాన్‌లో నవంబర్ 1 నుంచి వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతాయి. పలువురు సీనియర్ లిఫ్టర్లకు ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో పాల్గొన్న తర్వాత నుంచి ఇప్పటివరకు ఎలాంటి విశ్రాంతి దొరకలేదు. ఈ నేపథ్యంలో వారు 2020లో జపాన్‌లోని టోక్యోలో నిర్వహించే ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా వారికి విశ్రాంతి ఇచ్చారు. తమ ప్రణాళికలో ఒకవేళ ఏమైనా మార్పులు జరిగితే నవంబర్‌లో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సీనియర్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉండొచ్చని ఇప్పటికే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారని, మరికొంతమంది వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారని, ఇలా దాదాపు నెల రోజుల సమయం వృధా అయిందని వెయిట్‌లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ పీటీఐ ప్రతినిధికి తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనాలో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో సీనియర్ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.