క్రీడాభూమి

ఇండో-పాక్ మ్యాచ్‌కు ఇమ్రాన్ ఖాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, సెప్టెంబర్ 18: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం భారత్-పాక్ మధ్య జరిగే ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఆ దేశ మీడియా కథనం ప్రకారం..పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తున్నారు. దుబాయ్‌లో బుధవారం దాయాది జట్లు (్భరత్-పాక్) మధ్య జరిగే పోరును ఆయన తిలకించనున్నారని జీఈఓ టీవీ అనే చానల్ వెల్లడించింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు వీలుగా ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించేందుకు బయలుదేరినట్టు ఆ చానల్ పేర్కొంది.