క్రీడాభూమి

నమ్మలేకపోయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు కోసం తన పేరు ప్రతిపాదించారంటే నమ్మలేకపోయానని భారత సంచలన స్టార్ అథ్లెట్, సరికొత్త పరుగుల యంత్రం హిమా దాస్ పేర్కొంది. అసోం చెందిన ఆమె తన పేరును ఈ ఏడాది అర్జున అవార్డుకు ప్రతిపాదించిన 20 క్రీడాకారుల జాబితాలో ఉందన్న విషయం తెలిసిన వెంటనే కాసేపు ఆశ్చర్యానికి గురై నమ్మలేకపోయానని ఆనందం వ్యక్తం చేసింది. ఈ జాబితా ప్రస్తుతం కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పరిశీలనలో ఉంది. వాస్తవానికి వచ్చే ఏడాది తనకు అర్జున అవార్డు రావచ్చుననే ఆలోచనలోనే ఉన్నానని, కానీ తాను చూపిన ప్రతిభను గుర్తించి ఈ ఏడాదే అర్జున అవార్డుకు తన పేరును ప్రతిపాదించినందుకు సంతోషం వ్యక్తం చేసింది ఈ 18 ఏళ్ల పరుగుల రాణి. ఫిన్లాండ్‌లో జరిగిన అండర్-20 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న హిమ దాస్ గోల్డ్ మెడల్ సాధించింది. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లోని వేర్వేరు విభాగాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్న ఆమె గోల్డ్ మెడల్‌తోపాటు రజత పతకం, వ్యక్తిగత పతకాన్ని కూడా అందుకుంది. ఈ ఏడాది తన ప్రయాణం ఎంతో బాగా సాగిందని, వచ్చే ఏడాది దక్షిణ ఆసియా గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో జరిగే వివిధ ఈవెంట్లలో మెడల్స్ సాధించేందుకు సరైన శిక్షణ పొందనున్నానని తెలిపింది.