క్రీడాభూమి

ఒలింపిక్స్‌పైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 18: ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న ట్రిపుల్ జంపర్ అర్పీందర్ సింగ్ ఇపుడు తన దృష్టి అంతా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉందని అన్నాడు. క్రెచ్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావాలో జరిగిన ఐఏఏఎఫ్ కాంటినెంటల్ కప్‌లో 16.59 మీటర్లతో మెడల్ కైవసం చేసుకున్న తొలి భారతీయుడిగా అర్పీందర్ రికార్డు సృష్టించాడు. ఇక్కడ జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఏడాది దోహా, ఖతర్‌లో జరిగే ఆసియా, వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌లో పోటీకి అర్హత సాధించిన తన లక్ష్యమంతా టోక్యో ఒలింపిక్స్‌పైనే ఉందని అన్నాడు. ఒలింపిక్స్‌లో పోటీ ఆసియా గేమ్స్ కంటే చాలా తీవ్రంగా ఉంటుందని, అయినా పోటీలో ఉత్తమ ప్రదర్శన చూపగలిగితే పతకం తప్పకుండా సాధించవచ్చుననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం 17.17 మీటర్లుగా తన ఉత్తమ ప్రదర్శన ఉందని, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో 17.40 మీటర్లకు చేరుకోవడమే తన లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని గట్టి నమ్మకంతో చెప్పాడు. కాగా, జకార్తా, పాలెంబంగ్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో అర్పీందర్ సింగ్ 16.77 మీటర్లతో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్ అందించిన విషయం తెలిసిందే.