క్రీడాభూమి

రష్యాను నమ్మితే విపత్తు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, సెప్టెంబర్ 19: వ్యూహాత్మక డోపింగ్‌కు పాల్పడిన రష్యాను ఎంత మాత్రం నమ్మకూడదని, ఒకవేళ నమ్మితే విపత్తు తప్పదని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా)ను గ్రిగరీ రొడ్చెనొవ్ హెచ్చరించాడు. మాదక ద్రవ్యాల వినియోగం లేని క్రీడా రంగం కోసం ఎంతోకాలంగా పోరాడుతున్న రొడ్చెనొవ్ 2015లో రష్యా వ్యూహాత్మక డోపింగ్‌ను బట్టబయలుచేసి సంచలనం సృష్టించాడు. ఒక దేశం స్వయంగా క్రీడాకారులను డోపింగ్‌కు ప్రోత్సహించడం యావత్ క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన విషయం తెలిసిందే. గతంలో మాస్కోలోని డోపింగ్ నిరోధక విభాగానికి చీఫ్‌గా పని చేసిన అతను ఆతర్వాత అమెరికా వలస వెళ్లాడు. రష్యా వ్యూహాత్మ డోపింగ్‌కు పాల్పడుతున్న విషయాన్ని అతను సాక్ష్యాధారాలతోసహా బహిర్గతం చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందంచిన వాడా తక్షణ చర్యల తీసుకుంది. రష్యా డోపింగ్ నిరోధక విభాగం (రాడా)ను నిషేధించింది. అయితే, కొంతమంది అధికారుల తప్పిదం వల్ల ఈ పరిస్థితి నెలకొందని, ఇకపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని రష్యా ప్రకటించింది. డోపింగ్ రహిత క్రీడలకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఆ దేశం తీసుకుంటున్న వివిధ చర్యలను పరిగణలోకి తీసుకొని, రాడాపై నిషేధాన్ని ఎత్తివేసేందుకు వాడా సిద్ధమైంది. కాగా, ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే, పతనానికి పునాది వేసినట్టు అవుతుందని రొడ్చెనొవ్ వాడాను హెచ్చరించాడు. దేశంలో డోపింగ్‌ను నిరోధించడానికి తీసుకుంటున్న చర్యల జాబితాను రష్యా ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నప్పటికీ, అందులోని వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాడు. లేకపోతే, ఒలింపిక్ క్రీడాస్ఫూర్తికి విఘాతం తప్పదని స్పష్టం చేశాడు.