క్రీడాభూమి

ముచ్చట తెచ్చిన తంటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, సెప్టెంబర్ 19: అంపైర్లు, రిఫరీలకు ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. పోటీలో ఉన్న వ్యక్తులు లేదా జట్ల పట్ల సమభావంతో వ్యవహరిస్తూ, సమ న్యాయం చేయాలి. కానీ, అందుకు భిన్నంగా ప్రవర్తించి, తన అభిమాన టెన్నిస్ ఆటగాడితో ముచ్చట చేసినందుకు ఓ అంపైర్‌పై వేటు పడింది. గత నెల జరిగిన యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా చోటు చేసుకున్న ఈ సంఘటనపై అమెరికా టెన్నిస్ సంఘం (యూఎస్‌టీఎ) వివరణను ఇచ్చింది. ఒక మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్‌తో మాట్లాడి, అతనికి కొన్ని సూచనలు చేసిన మొహమ్మద్ లాహ్యానీ (స్వీడన్)ను రెండు వారాల పాటు సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. పియరీ హూస్ హెర్బర్ట్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు కిర్గియోస్ పదేపదే పొరపాట్లు చేశాడు. ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకున్నాడు. ఇది చూసిన అంపైర్ లాహ్యానీ తన కుర్చీ దిగి నేరుగా కిర్గియోస్ వద్దకు వెళ్లాడు. అతనంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొన్నాడు. పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికాడు. 3నేను నీకు ఏదైనా సాయం చేయాలా?2 అంటూ కిర్గియోస్‌ను లాహ్యానీ అడగడం మైక్‌లో స్పష్టంగా వినిపించింది. ఆ మ్యాచ్‌ని కిర్గియోస్ గెల్చుకోగా, అంపైర్ స్థానంలో ఉండి లాహ్యానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సంఘటనపై విచారణ జరిపిన యూఎస్‌టీఏ లాహ్యానీపై సస్పెన్షన్ వేటు వేసింది. మరోసారి ఇలాంటి పనులకు పాల్పడితే, కఠినాతి కఠినంగా శిక్షించక తప్పదని స్పష్టం చేసింది.