క్రీడాభూమి

పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 19: ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో నిలకడగా ఆడలేకపోయన భారత్ బుధవారం తనదైన రీతిలో ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 43.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (47), షోయబ్ మాలిక్ (43), చివరిలో ఫహీం అషఫ్ (21), మహమ్మద్ అమీర్ (18) కొద్ది సేపు భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయంది. భువనేశ్వర్ కుమార్ 15 పరుగులకు మూడు, కేదార్ జాధవ్ 23 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు. కాగా, అత్యంత సాధా రణ లక్ష్యాన్ని భారత్ కేవలం 29 ఓవర్లలో, రెండు వికెట్లు మాత్రమే చేజార్చుకొని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52), దినేష్ కార్తీక్ (46) చక్కటి ఆరంభాన్ని అందించగా, ఆతర్వాత అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ చెరి 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ రెండు వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించి, పాక్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో టీమిండియాను హాట్ ఫేవరిట్‌గా పేర్కొంటున్నారు.