క్రీడాభూమి

అంత ఈజీ కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 20: ఆసియా కప్ వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసినప్పటికీ, శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరగబోయే మ్యాచ్ అనుకున్నంత సులభం కాదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతి కష్టం మీద గెలిచిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. చివరి వరకూ పోరాడే తత్వం ఉన్న బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే, రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టుకు కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పాక్‌ను సునాయాసంగా ఓడించిన స్ఫూర్తితో బంగ్లాదేశ్‌ను ఢీకొనేందుకు భారత క్రికెటర్లు సమాయత్తమవుతున్నారన్నది వాస్తవం. కాగితంపై చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప్రత్యర్థి కంటే రోహిత్ శర్మ సేన బలమైన స్థితిలో ఉంది. అయితే, జట్టును గాయాల బాధ వెంటాడి వేధిస్తున్నది. బుధవారం పాకిస్తాన్‌తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కాగా, స్పిన్నర్ అక్షర్ పటేల్, పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా గాయాల కారణంగా టోర్నీకి దూరమయ్యారు. పాండ్య స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేస్తాడు. అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ జట్టులోకి వస్తారు. ఈ మార్పుల ఫలితం ఎంత వరకూ భారత్‌కు అనుకూలిస్తుందో చూడాలి. వరుసగా రెండు విజయాలను సాధించడంతో, మూడో మ్యాచ్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్‌పై మూడు వికెట్లు పడగొట్టిన భువీని తప్పిస్తే, అతని స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను ఆడించక తప్పదు. పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన దీపక్ చాహర్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. స్వదేశం నుంచి బయలుదేరిన చాహర్ దుబాయ్ చేరుకుని, ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే మైదానంలోకి దిగుతాడా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. మిడిల్ ఆర్డర్‌లో మనీష్ పాండేను తుది జట్టులోకి తీసుకుంటే, బ్యాటింగ్ బలం పెరుతుందనడంలో సందేహం లేదు. కేదార్ జాదవ్ ఆప్ బ్రేక్ బౌలింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక ఆయుధంగా ఉపయోగపడనుంది. పాకిస్తాన్‌పై అతను అద్భుతంగా రాణించడంతో, మరోసారి అలాంటి ప్రదర్శననే అటు అభిమానులు, ఇటు జట్టు మేనేజ్‌మెంట్ కోరుకోవడంలో తప్పులేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. అంబటి రాయుడు, దినేష్ కార్తీక్ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తారు. వీరిద్దరూ కూడా పాక్‌పై అజేయ భాగస్వామ్యాన్ని అందించి తమను తాము నిరూపించుకున్నారు. అయితే, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ వైఫల్యాలు జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ అతనికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చినా, బ్యాటింగ్‌లో మెరుపులు చూపిస్తాడా అనేది అనుమానమే.
పాక్‌ను చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియాకు బంగ్లాదేశ్‌తో ఆ స్థాయిలో పోటీ ఉండదు. అంతమాత్రం చేత ఆ జట్టుతో ఓడినా ఫరవాలేదనే ధీమాతో ఉండకూడదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 2015 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్ చేతిలోనే భారత్ ఓడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. పైగా, గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శనతో రాణిస్తున్నది. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్వితీయ ప్రతిభాపాటవాలు కనబరుస్తున్నది. 2012 ఆసియా కప్‌లో ఫైనల్ వరకూ చేరడం బంగ్లాదేశ్ శక్తిసామర్థ్యాలను చెప్పకనే చెప్తున్నది. మష్రాఫ్ మొర్తాజా కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ జట్టులో షకీబ్ అల్ హసన్ రూపంలో సమర్థుడైన ఆల్‌రౌండర్ ఉన్నాడు. తమిమ్ ఇక్బాల్, వికెట్లు కూలుతున్నా ఒంటరి పోరాటాన్ని కొనసాగించే సత్తావున్న మహమ్మద్ మిథున్, ముష్ఫికర్ రహీం, మహమ్మదుల్లా, ముస్త్ఫాజుర్ రహ్మాన్ వంటి సమర్థులు ఆ జట్టులో ఉన్నారు. ఈ జట్టుపై భారత్‌కు విజయం అసాధ్యమేమీ కాకపోవచ్చు. కానీ, సులభం మాత్రం కాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

చిత్రం..గాయపడి టోర్నీకి దూరమైన భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య