క్రీడాభూమి

కోర్టే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం తప్ప తనకు మరో మార్గం లేదని స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా స్పష్టం చేశాడు. అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్నకు తనను ఎంపిక చేయకపోవడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని వాపోయాడు. తన మెంటర్, ఒలింపియన్ యోగేశ్వర్ దత్‌తో కలిసి శుక్రవారం విలేఖరుల సమావేశానికి హాజరైన బజరంగ్ మాట్లాడుతూ, ఖేల్ రత్న అవార్డుకు తాను అన్ని విధాలా అర్హుడినని వ్యాఖ్యానించాడు. నిజానికి శుక్రవారం ఉదయం మంత్రి రాథోడ్‌తో సమావేశం కావాల్సి ఉండిందని అన్నాడు. కానీ, గురువారం రాత్రి తనకు మంత్రి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రతిపాదించినప్పటికీ, ఖేల్ రత్న అవార్డుకు తనను ఎందుకు ఎంపిక చేయలేదని తాను మంత్రిని అడిగానని తెలిపాడు. అయితే, మంత్రి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని అన్నాడు. ఖేల్ రత్న అవార్డుకు పాయింట్లను ప్రాతిపదికగా తీసుకుంటామని మంత్రి తనతో చెప్పాడని బజరంగ్ అన్నాడు. నిజానికి ఈ అవార్డుకు ఎంపికైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను కంటే తనకే ఎక్కువ పాయింట్లు ఉన్నాయని కామనె్వల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలను సాధించి, స్టార్ రెజ్లర్‌గా పేరు సంపాదించిన బజరంగ్ అన్నాడు. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం కోసం పోరాడతానని స్పష్టం చేశాడు. ఈ విషయాన్ని అవార్డు కమిటీ దృష్టికి తీసుకెళతానని మంత్రి తనతో చెప్పారని, కానీ, ఈలోపే అవార్డుల ప్రదాన కార్యక్రమం కూడా పూర్తవుతుందని వ్యాఖ్యానించాడు. శుక్రవారం సాయంత్రం వరకూ వేచిచూస్తానని, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఖేల్ రత్న జాబితాలో తన పేరు చేర్చకపోతే, శనివారం కోర్టుకు వెళతానని వివరించాడు. పాయింట్ల విధానాన్ని 2014లో ప్రవేశపెటాటరని, తాను 2013 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, పాయింట్ల జత కలిసే అవకాశం లేదని వివరించాడు. అవార్డు కమిటీ నిబంధనలను అనుసరించి, ఖేల్ రత్న అవార్డుకు యాంత్రికంగా పేర్ల ఎంపిక జరగదని అన్నాడు. ఒక్కో క్రీడలో ఉన్నత ప్రమాణాలను అందుకున్న, ఎక్కువ పాయింట్లు పొందిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేయాల్సి ఉంటుందన్నాడు. తన పేరును ఉద్దేశపూర్వకంగానే తొలగించి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడం మినహా తనకు మరో మార్గం లేదని బజరంగ్ స్పష్టం చేశాడు.
జాబితా మార్పు కష్టమే!
క్రీడాకారులకు ప్రకటించిన అవార్డు జాబితాను మార్చడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. పేరు చెప్పడానికి ఇష్టపడని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి పీటీఐతో మాట్లాడుతూ, జాబితాలో ఒకరి పేరు చేరిస్తే, ఇలాంటి డిమాండ్లే మరిన్ని తెరపైకి వచ్చే అవకాశం ఉందన్నాడు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాథోడ్ కూడా జాబితాను సవరించడానికి సుముఖంగా లేరని అన్నాడు. కాగా, ఈ అవార్డులను ధ్యాన్‌చంద్ జయంతి రోజైన ఆగస్టు 29వ తేదీన ప్రదానం చేయాల్సి ఉండింది. కానీ, ఆ సమయంలో ఆసియా క్రీడలు జరుగుతున్న కారణంగా, ప్రదాన ఉత్సవాన్ని ఈనెల 25వ తేదీకి మార్చారు.