క్రీడాభూమి

మళ్లీ గెలుస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 22: ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆదివారం జరిగే మరో గ్రూప్ మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నామని, ఈ పోరులో విజయం తమదేనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌ని ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కేదార్ జాదవ్ 23 పరుగులకు మూడు, భువనేశ్వర్ కుమార్ 15 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను 162 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం లక్ష్యాన్ని కేవలం 29 ఓవర్లలోనే, రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (46)తో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన రోహిత్ 52 పరుగులు సాధించి, టీమిండియా బ్యాటింగ్ బలాన్ని ప్రత్యర్థికి రుచిచూపించాడు. అలాంటి ప్రదర్శనతోనే మరోసారి పాక్‌ను ఓడిస్తామని శనివారం ఒక ఇంటర్వ్యూలో రోహిత్ చెప్పాడు. ఈ పోరాటానికి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామన్నాడు. తక్కువ ఓవర్లకే బౌలింగ్‌ను రొటేట్ చేయడం ద్వారా బౌలర్లకు తగినంత విశ్రాంతినిస్తామని చెప్పాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రత్యేకంగా వ్యూహాలంటూ ఏవీ లేవని, మైదానంలోకి దిగిన తర్వాత, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నందున పాక్‌ను ఓడించడం కష్టం కాదని అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.