క్రీడాభూమి

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బీఎన్ దత్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 24: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు బిశ్వనాథ్ దత్ (92) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాంలంగా ఆయన ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. జగ్మోహన్ దాల్మియాకు గురువుగా పేరున్న దత్ 1989లో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఆరేళ్లపాటు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు సుభ్రతాదత్తా అఖిలభారత ఫుట్‌బాల్ సమాఖ్య సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈనెల 10న అస్వస్ధతకు గురైన బిశ్వనాథ్ దత్తా అప్పటి నుంచి కోలుకోలేదు. అక్టోబర్ 10న ఆయన 93వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉంది. యువకునిగా ఉన్న జగ్మోహన్ దాల్మియాను 1077లో బెంగాల్ క్రికెట్ సంఘం కోశాధికారిగా నియమించడంలో బిశ్వనాథ్ దత్ కీలక భూమిక పోషించారు. అప్పట్లో దత్ బెంగాల్‌లో అటు ఫుట్‌బాల్, ఇటు క్రికెట్ క్రీడల పాలనా విభాగాల్లో కీలకంగా వ్యవహరించేవారు. ఆ తర్వాత దాల్మియా భారత క్రికెట్ రంగంలో ఎంత కీలక వ్యక్తిగా మారారో తెలిసిందే. 1090లో జరిగిన బీసీసీఐ ఎన్నికల్లో జగ్మోహన్ దాల్మియా కాంగ్రెస్ నేత మాధవరావుసింధియా అభ్యర్థిత్వాన్ని బలపరిచడంతో దాల్మియా, దత్ గురుశిష్య బంధానికి విఘాతం కలిగింది. ఆ ఎన్నికల్లో దత్ ఓటమిపాలవడంతో ఆయన క్రీడా పరిపాలనా వ్యవస్థలో కీలకభూమిక నుంచి తప్పుకున్నారు.