క్రీడాభూమి

లోపించిన ఆత్మవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 24: పాకిస్థాన్ క్రికెట్ జట్టులోప్రస్తుతం ఆత్మవిశ్వాసం కరవైందని భారత జట్టుతో ఆ జట్టు దారుణ పరాజయానంతరం విలేఖరులతో మాట్లాడుతూ కోచ్ మిక్కీ ఆర్థర్ వ్యాఖానించాడు. ఆసియా కప్‌లో ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు అత్యంత దారుణమైన ఆటతీరును ప్రదర్శించిందని అంటూ వారిని మరింతగా కుంగదీయడం తన ఉద్దేశం కాదన్నాడు. డ్రస్సింగ్ రూంలో ఆటగాళ్లను తాను గమనించినపుడు మనది గొప్పజట్టు అనే భావన స్థానంలో మ్యాచ్‌లో ఓడిపోతామేమోనన్న భయమే అధికంగా కనిపిస్తోందని, ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు భారత జట్టు చేతిలో ఓడిపోవడమే ఇందుకు నిదర్శనమని ఆర్థర్ పేర్కొన్నాడు.
సమర్థవంతమైన భారత ఆటగాళ్లకు 39 ఓవర్లకే సునాయాసమైన 9 వికెట్ల ఘనవిజయాన్ని పాక్ ఆటగాళ్లు అందించారని, ఏ దశలోనూ వారిలో పోరాట తత్వం కనిపించలేదని అన్నాడు. పాక్ బ్యాటింగ్, బౌలింగ్ స్ట్రైక్ రేటు ఏమాంత్రం బాగాలేదన్నాడు. మ్యాచ్‌లో పైచేయి సాధించే రెండుమూడు అవకాశాలు వచ్చినా చేజేతులా జారవిడిచారన్నాడు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెచ్చిపోతారని, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అదే చేసి చూపించారని ఆర్థర్ పేర్కొన్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత జట్టుపై ఆయన ప్రసంశల వర్షం కురిపించాడు. అయినా ఓ మంచి జట్టు చేతిలో ఓటమి చెందినంత మాత్రాన కుంగిపోకూడదని, వాస్తవ దృష్టితో జట్టు ముందుకు సాగాల్సివుందని ఆర్థర్ అభిప్రాయపడ్డాడు.
సర్‌ఫ్రాజ్ అహ్మద్, మహమ్మద్ అమీర్, షోయబ్ మాలిక్ లాంటి ప్రతిభావంతులు మన జట్టులో ఉన్నారన్న సంగతి మరువరాదని దక్షిణాఫ్రికన్ కోచ్ ఆర్థర్ గుర్తు చేశాడు. భారత బౌలర్ బుమ్రా తననెంతగానో ఆకట్టుకున్నాడని, నెట్స్‌లో ఆయన యార్కర్లలో వైవిధ్యం కోసం తీవ్రంగా కృషి చేయడం చూశానని ఆయన చెప్పాడు. బుధవారం జరగనున్న బంగ్లాదేశ్- పాక్ మ్యాచ్ పాక్‌కు ఎంతో కీలకమైనదని ఆయన అన్నాడు.