క్రీడాభూమి

బౌలర్లు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, సెప్టెంబర్ 24: ఆసియా కప్ ఫైనల్‌లో చోటు దక్కించేందుకు సమష్టిగా రాణించిన బౌలర్లను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభినందించాడు. ఆదివారం తమ చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తన ఖాతాలో ఘన విజయాన్ని నమోదు చేయడానికి కారకులైన బౌలర్లదే ఈ ఘనత అన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకునేందుకు మార్గం సుగమం చేసినందుకు ఆయన ప్రశంసల వర్షం గుప్పించాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన రెండు సూపర్ ఫోర్ గేమ్స్‌లలో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో వరుసగా 162, 237 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేయగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 173 పరుగులకే అవుట్ చేశారన్నాడు. ఆయా మ్యాచ్‌లలో మొత్తం బౌలింగ్ విభాగం అద్భుత ఆటతీరును కనబరచిందని అంటూ వారికి హ్యాట్సాఫ్ తెలిపాడు. మ్యాచ్‌లలో క్లిష్ట పరిస్థితులు ఎదురైన సమయాల్లో సైతం బౌలర్లు ఛాలెంజ్‌గా తీసుకుని సమష్టి బాధ్యతగా గుర్తించి జట్టు విజయానికి బాటలు వేశారని అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా గతంలో కంటే తన ఆటతీరును మరింత మెరుగుపరచుకున్నాడని, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ వంటివారు జట్టును అందరి అంచనాలకు భిన్నంగా ముందుకు తీసుకువెళ్లడంలో సమర్థవంతమైన పాత్రను పోషించారని అన్నాడు. మంగళవారం అఫ్గనిస్తాన్‌తో జరిగే పోరులో బౌలర్లు ఇదే ఉత్సాహం, ఊపుతో సమష్టిగా రాణించాలని అభిలషించాడు.