క్రీడాభూమి

ప్రముఖ కామెంటేటర్ జస్‌దేవ్ సింగ్ అస్తమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: ప్రముఖ వ్యాఖ్యాత (కామెంటేటర్), దూరదర్శన్‌లో భారత క్రీడలపై ఎంతో కాలంపాటు తన గళాన్ని అందించిన జస్‌దేవ్ సింగ్ తీవ్ర అస్వస్థతతో మరణించాడు. ఆయన వయసు 87 సంవత్సరాలు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 1970 తర్వాత, 1980కి ముందు దూరదర్శన్ ఉత్తమంగా రాణిస్తున్న కాలంలో రవి చతుర్వేది, సుశీల్ దోషితో కలసి ఆయన క్రీడా వార్తలను అందించేవాడు. క్రీడావార్తల కవరేజితో ఎంతోమంది క్రీడాభిమానులను సంపాదించాడు. జస్‌దేవ్ మృతి పట్ల కేంద్ర క్రీడలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తీవ్ర సంతాపం తెలిపాడు. క్రీడా వార్తలను ప్రజలకు అందించిన వారిలో ఉత్తమ వ్యాఖ్యాతగా జస్‌దేవ్ సింగ్ నిలిచాడని పేర్కొన్నాడు. ఆకాశవాణి, దూరదర్శన్‌లలో తొమ్మిదిసార్లు ఒలింపిక్, ఆరుసార్లు ఆసియా గేమ్స్‌తోపాటు లెక్కకు మించిన స్వాతంత్య్ర దినోత్సవాలు, గణతంత్య్ర దినోత్సవాల్లో జస్‌దేవ్ సింగ్ తన అద్భుత గళాన్ని దేశ ప్రజలకు వినిపించాడని కేంద్ర మంత్రి గుర్తు చేశాడు. 1988 సియోల్ ఒలింపిక్స్ సందర్భంగా అప్పటి మాజీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ చీఫ్ జువాన్ ఆంటోనియో సమరాంచ్ ‘ఒలింపిక్ ఆర్డర్’తో జస్‌దేవ్ సింగ్‌ను ఘనంగా సత్కరించాడు. 1985లో పద్మశ్రీ, 2008లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం జస్‌దేవ్ సింగ్‌ను ఘనంగా సత్కరించింది.