క్రీడాభూమి

ఆసియా కప్ ఫైనల్‌లో చోటు కోసం నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబూదాబి, సెప్టెంబర్ 25: సూపర్ ఫోర్ గేమ్‌లో భాగంగా ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఘోరంగా దెబ్బతిన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో తలపడనున్నాయి. ఈ పోటీలో గెలుపొందిన జట్టు ఫైనల్ పోరులో భారత్‌తో పోరాడుతుంది. బంగ్లా, పాక్ జట్ల ఆటతీరును బేరీజు వేసుకుంటే ఒక విధంగా పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్ల సెమీస్ పోరుకు ఇక్కడి షీఖ్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ జట్టులో షోయబ్ మాలిక్ గత మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేశాడు. బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో షోయబ్ మాలిక్‌తోపాటు మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు కూడా చక్కగా రాణిస్తే పైచేయి సాధించవచ్చు. ముఖ్యంగా పాక్‌కు బౌలర్ల సమస్య వేధిస్తోంది. గత మ్యాచ్‌లో కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహమ్మద్ ఎంతో నమ్మకం పెట్టుకున్న మహమ్మద్ అమీర్ తన పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్నాడు. మిగిలిన బౌలర్లు కూడా అంతగా రాణించలేదు. అయితే, బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగే సెమీఫైనల్స్‌లో జట్టు బాగా రాణించగలదనే నమ్మకాన్ని కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహమ్మద్ వ్యక్తం చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పాక్ కోచ్ మికీ ఆర్థర్ జట్టు మాట్లాడుతూ తమకు ఫైనల్‌కు చేరుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, దారులేమీ మూసుకుపోలేదని అంటూ జట్టు సభ్యుల్లో క్రీడాస్ఫూర్తిని నింపాడు.
అదేవిధంగా బంగ్లాదేశ్ సైతం సెమీస్‌లో పైచేయి సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. గత మ్యాచ్‌లలో అఫ్గనిస్తాన్, భారత్ చేతుల్లో ఓటమి చెందినప్పటికీ సెమీస్‌లో గెలుపుపై ఆశలు సన్నగిల్లలేదని బంగ్లాదేశ్ జట్టు చెబుతోంది.