క్రీడాభూమి

టీ-20 సిరీస్ మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక: శ్రీలంకతో జరిగిన ఐదు టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒకటి రద్దు కాగా, మిగిలిన నాలుగింట్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన ఐదో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 17.4 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ టీమ్‌లో అనుష్క సంజీవని (29), శశికళ సిరివర్ధనే (22), ఒషాది రణసింఘే (22) మినహా మిగిలిన బ్యాట్స్‌ఉమన్‌లెవరూ ఆశించిన స్కోరు చేయలేకపోయారు. భారత జట్టులో పూనమ్ యాదవ్ మూడు, దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.3 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (63), జెమీమా రోడ్రిగ్స్ (46) ఒంటరి పోరాటంతో జట్టును గెలిపించే బాధ్యతను నెరవేర్చారు. మిగిలిన క్రికెటర్లు ఎవరూ ఆశించిన స్కోరు సాధించలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో శశికళ సిరివర్ధనే, ఇనోషి ప్రియదర్శిని తలో మూడు వికెట్లు పడగొట్టారు.