క్రీడాభూమి

పృథ్వీ షాకు కోహ్లీ పొగడ్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, అక్టోబర్ 6: టెస్టు క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన వెంటనే అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ పృథ్వీ షాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టుమ్యాచ్‌లో ఈ ముంబయి టీనేజర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ (134) చేసి ఎంతోమంది నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ఘనత సాధించిన భారత యువ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టెస్టులో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన పృథ్వీ షా అందర్నీ డామినేట్ చేసేలా ఆడిన తీరు గొప్పదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. షా ఆడిన తొలి మ్యాచ్‌లోనే మంచి శుభారంభం అందించాడని, దేశవాళీ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఆడుతున్నట్టుగానే టెస్టు మ్యాచ్‌లోనూ ఆడాడని కొనియాడాడు. టెస్టులో తొలిసారిగా సెంచరీ చేయడంతోపాటు జట్టుకు ఎంతో విలువైన పరుగులు అందించిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పాత్ర కూడా మరువలేనిదని కోహ్లీ అన్నాడు. ఈ సెంచరీ జడేజా క్రీడాజీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. అదేవిధంగా పేసర్ల ద్వయం మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ప్రత్యర్థిపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చి తక్కువ పరుగులకే పెవిలియన్ పట్టేలా చేశారని అన్నాడు.
ఇంగ్లాండ్‌లో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-4తో కోల్పోవడంపై మాట్లాడుతూ ఈ రెండు టెస్టులకు ఎంతో సారూప్యం ఉందని, అంటూ వెస్టిండీస్‌తో తొలి టెస్టులో అద్భుత విజయం తమకు గొప్ప ఛాలెంజ్‌లాంటిదని అన్నాడు. మ్యాచ్ ఆరంభం నుండే తమ శక్తిసామర్ధ్యాలేమిటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యామని, అందుకు తగ్గట్టుగానే ఫలితం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.