క్రీడాభూమి

పావెల్ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు వెనుకబడిన వెస్టిండీస్‌కు ఫాలోఆన్ తప్పలేదు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో జాగ్రత్తగా ఆడాల్సిన వెస్టిండీస్ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక మరోసారి కుప్పకూలింది. ఓపెనర్ కీరన్ పావెల్ ఒంటరి పోరాటం జరిపి, 93 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పృథ్వీ షా చక్కటి క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. 50.5 ఓవర్లు ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులకే ఆలౌటైంది. హోం కండీషన్స్‌ను సద్వినియోగం చేసుకున్న కుల్దీప్ యాదవ్ 14 ఓవర్లలో 57 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రవీంద్ర జడేజా 35 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి, తాను సమర్థడైన ఆల్‌రౌండర్‌నని మరోసారి రుజువు చేసుకున్నా డు. ఈ సిరీస్‌లో చివరిదైన రెండో టెస్టు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 16 వరకు జరుగుతుంది.