క్రీడాభూమి

కుల్దీప్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, అక్టోబర్ 6: టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న టీమిండియా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించింది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం కనబరచింది. అందుకు భిన్నంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై, ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయిన వెస్టిండీస్ ఏ రకంగానూ బలమైన పోటీని ఇవ్వలేక, ఇన్నింగ్స్ పరాజయాన్ని ఎదుర్కొంది. కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలం భారత్‌కు అలవోక విజయాన్ని అందించింది. ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఆడిన తొలి టెస్టులోనే సెంచరీతో కదంతొక్కి, పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న యువ సంచలనం పృథ్వీ షా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన యువ స్పిన్నర్ కుల్దీప్ విండీస్ చిత్తుకావడంలో కీలక భూమిక పోషించాడు. ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం ఒక విశేషమైతే, మూడో రోజైన శనివారం ఏకంగా పది వికెట్లు కూలడం మరో విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేయగా, ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 94 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన విండీస్‌కు రాస్టన్ చేజ్ (53), కిమో పాల్ (47) కొంత సేపు అండగా నిలిచారు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో చటేశ్వర్ పుజారా క్యాచ్ అందుకోగా కిమో పాల్ ఔట్ కావడంతో విండీస్‌కు ఫాలోఆన్ తప్పదన్న విషయం స్పష్టమైంది. ఆతర్వాత కొద్ది సేపటికే రాస్టన్ చేజ్ వికెట్ కూడా కూలింది. అర్ధ శతకాన్ని నమోదు చేసిన అతని వికెట్‌ను అశ్విన్ పడగొట్టాడు. దేవేంద్ర బిషూ 17 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, షెర్మన్ లూయిస్ (0), షానన్ గాబ్రియల్ (1) త్వరత్వరగా పెవిలియన్ చేరడంతో వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌కు 48 ఓవర్లలో 181 పరుగుల వద్ద తెరపడింది. రవిచంద్ర అశ్విన్ 37 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ రెండు వికెట్లు సాధించాడు. ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌కు తలా ఒక్కో వికెట్ దక్కింది.

చిత్రం..కుల్దీప్ యాదవ్ (14-2-57-5)