క్రీడాభూమి

ముందుంది.. సిసలైన పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టుతో ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసి, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి సంచలనం సృష్టించిన పృథ్వీ షాకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అంతా ముక్తకంఠంతో అంటున్నారు. అయితే, కొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం టెక్నిక్ మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో అసలుసిసలైన పరీక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పృథ్వీ షా బ్యాట్‌ను శరీరానికి దూరంగా ఉంచుతాడని, బ్యాక్‌ఫుట్ ఆటను ఇష్టపడతాడని వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ కార్ల్ హూపర్ అన్నాడు. శరీరానికి బ్యాట్‌ను దూరంగా ఉంచి, స్క్వేర్ షాట్లు కొడతాడని చెప్పాడు. ఈ విధానం భారత్‌లో పనికొస్తుందేతప్ప, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కాదని హూపర్ స్పష్టం చేశాడు. బంతి మెరుపు వేగంతో దూసుకొచ్చినప్పుడు, దానిని పృథ్వీ షా ప్రస్తుత విధానంలో ఆడడం వల్ల సమస్యలు తప్పవని పేర్కొన్నాడు. భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా మాత్రం పృథ్వీ షా టెక్నిక్ గురించి మాట్లాడలేదు. శాస్ర్తియ విధానంలోనే బ్యాటింగ్ చేస్తేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్న ఆలోచన తప్పని అన్నాడు. దీనికి వీరేందర్ సెవాగ్‌ను ఉదాహరణగా పేర్కొన్నాడు. సెవాగ్ అద్వితీయ ప్రతిభా పాటవాలను కనబరచినప్పుడు, పృథ్వీ షా అదే అశాస్ర్తియ టెక్నిక్‌తో ఎందుకు రాణించడని ప్రశ్నించాడు. అయితే, అతను భవిష్యత్తులో కఠిన పరీక్షలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశాడు. భారత్ పిచ్‌లపై ఆడినట్టు ఆస్ట్రేలియా వంటి దేశాల్లో సాధ్యం కాదని అన్నాడు. ఈ నెలాఖరుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో పృథ్వీ షాకు స్థానం తప్పక దక్కుతుందని జోస్యం చెప్పాడు. అక్కడ అతనికి ఆసీస్ పిచ్‌లు, వాతావరణంతోపాటు అక్కడి ఫాస్ట్ బౌలర్ల నుంచి సవాళ్లు ఎదురవుకావడం ఖాయమని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. అతని ఆటతీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా పిచ్‌లపై జొష్ హాజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సి ఉంటుందన్నాడు. వారిని ఎదుర్కోవడం ఆషామాషి కాదని అన్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పదకొంతు వేలకుపైగా పరుగులు సాధించిన అమోల్ మజుందార్ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు, టెక్నిక్‌ను సరిచేసుకోవడానికి, అవసరమైన మార్పులు చేసుకోవడానికి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టును ఉపయోగించుకోవాలని పృథ్వీ షాకు సూచించాడు. అతను అనురిస్తున్న టెక్నిక్‌లో భారీ మార్పులు అవసరం లేకపోయినప్పటికీ, కొన్ని చిన్నచిన్న సర్దుబాట్లు చేసుకోవాలని హితవు పలికాడు. ఆస్ట్రేలియా టూర్ ఈ 18 ఏళ్ల యువ ఆటగాడి సామర్థ్యానికి పరీక్ష పెట్టనుందని జోస్యం చెప్పాడు. అక్కడ కూడా రాణిస్తే, పృథ్వీ షా టీమిండియాలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతాడని మజుందార్ అన్నాడు.