క్రీడాభూమి

24న విశాఖలో ఇండియా - వెస్టిండీస్ వనే్డ క్రికెట్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (లబ్బీపేట), అక్టోబర్ 8: రాష్ట్రం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు వేదిక కానుంది. విశాఖలో ఈ నెల 24న ఇండియా-వెస్టిండీస్ మధ్య రెండో వనే్డ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోరి ప్రకటించారు. భారత్, వెస్ట్‌ండీస్ తలపడే ఈ మ్యాచ్‌కు సంబంధించి 10శాతం కాంప్లిమెంటరీ టికెట్లు మంజూరు చేయనున్నామని తెలిపారు. నగరంలోని ఒక హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టికెట్ల అమ్మకాలు, తదితర అంశాలన్నీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తుందని తెలిపారు. వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలను ప్రతిరోజు బీసీసీఐ పర్యవేక్షిస్తుందని, దీనిద్వారా మ్యాచ్‌లు సాపీగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల అసోసియేషన్లకు కావలసిన సమాచారం కోసం ముందుగానే బీసీసీఐని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. 10 శాతం టికెట్లకు సంబంధించి వారికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ మహిళా క్రికెట్ కార్యకలాపాల కోసం గుంటూరులో మహిళా క్రికెట్ ఆకాడమీ ఆవిర్భవించిందని తెలిపారు. జాతీయ కార్యక్రమాలకు ఈ అకాడమీని వినియోగించుకోనున్నామని చెప్పారు. దీనిద్వారా రాష్ట్రంలో క్రికెట్ వైపు యువతీ యువకుల దృష్టి మళ్లుతుందన్నారు. బీసీసీఐ పరిధిలో 9 కొత్త జట్లు వచ్చి చేరాయని, 7 ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, పాండిచ్చేరి జట్లు కూడా బీసీసీఐ పరిధిలో ఆడనున్నాయని తెలిపారు. రాష్ట్ర అసోసియేషన్లు సైతం దేశీయ మ్యాచ్‌లకు మొగ్గు చూపుతున్నాయన్నారు. విలేఖరుల సమావేశంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సీహెచ్ అరుణ్‌కుమార్, ట్రెజరర్ కె రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ దుర్గాప్రసాద్, మీడియా మేనేజర్ సీఆర్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.