క్రీడాభూమి

ఆసియా పారా గేమ్స్‌లో ఏక్తా భ్యాన్‌కు గోల్డ్‌మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, అక్టోబర్ 9: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు చెందిన ఏక్తా భ్యాన్ గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. మంగళవారం ఇక్కడ మహిళల విభాగంలో పోటీ పడిన ఆమె నాలుగో ప్రయత్నంలో 16.02 మీటర్లు (ఎఫ్ 32/51)తో అగ్రస్థానంలో నిలిచి భారత్ ఖాతాలో నాలుగో గోల్డ్‌మెడల్‌ను చేర్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన అల్‌కాబీ థెక్రా 15.75 మీటర్లు (ఎఫ్ 32/51)తో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన ఇండియన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న ఏక్తా భ్యాన్ గోల్డ్‌మెడల్ సాధించే దిశగా పోరాడింది. కాగా, మంగళవారం ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు మూడు కాంస్యాలు సాధించారు. జయంతి బెహరా, ఆనందన్ గుణశేఖరణ్, మోనూ గంగాస్ వివిధ పోటీల్లో పాల్గొని ఈ పతకాలు అందుకున్నారు.