క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన జెరెమై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనోస్ ఎయిరెస్ (అర్జెంటీనా): యూత్ ఒలింపిక్స్‌లో మిజోరంకు చెందిన చిచ్చరపిడుగు జెరెమై లాల్‌రినున్‌ంగ్వా (15) చరిత్ర సృష్టించాడు. అర్జెంటీనా రాజధానిలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో చోటుదక్కించుకున్న వెంటనే పాల్గొన్న జెరెమై పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో అగ్రస్థానంలో నిలిచి భారత్‌కు తొలిసారిగా గోల్డ్ మెడల్ అందించాడు. వరల్డ్ యూత్ రజత పతక విజేత కూడా అయిన జెరెమా సోమవారం అర్ధరాత్రి జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 274 కేజీల (122 కేజీలు + 150 కేజీలు) విభాగంలో పాల్గొని టాప్‌లో నిలిచాడు. టర్కీకి చెందిన టోప్‌టాస్ క్యానర్ 263 కేజీలతో (122 కేజీలు + 141 కేజీలు) రజతం పతకం అందుకోగా, కొలంబియాకు చెందిన విల్లార్ ఈస్టివెన్ జొస్ 260 కేజీలతో (115 + 143) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. కాగా, మిజోరం సంచలన వెయిట్‌లిఫ్టర్ జెరెమాకు ఈనెల 26తో 16వ ఏట అడుగిడతాడు. జెరెమా తండ్రి లాల్‌నైత్లుంగా మాజీ బాక్సర్. ఏడుసార్లు జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో గోల్డ్‌మెడల్స్ గెల్చుకున్నాడు. కొడుకును కూడా బాక్సర్‌గా తీర్చిదిద్దాలనుకున్నా వెయిట్‌లిఫ్టింగ్ కోచ్‌ల సలహాలతో ఎనిమిదేళ్ల వయసులోనే స్పోర్ట్స్ స్కూల్‌లో చేర్చాడని మిజోరం వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఎన్.్థంగ్‌ఛుంగ్‌నుంగ్వా తెలిపాడు. జెరెమా తండ్రి ప్రస్తుతం మిజోరం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. కాగా, యువ చిచ్చరపిడుగు జెరెమా లాల్‌రింగ్వా ఈ ఏడాది యూత్ ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం, జూనియర్ విభాగంలో కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఇపుడు తాజాగా యూత్ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న వెంటనే గోల్డ్‌మెడల్ అందుకున్నాడు.