క్రీడాభూమి

లారా ఉన్నా గెలుపు కష్టమే! : జాసన్ హోల్డర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: బ్రియాన్ లారా వంటి దిగ్గజ ఆటగాడు ఉన్నా టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గెలుపు కష్టమేనని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో తమ జట్టు ఘోరంగా ఓటమి చెందిన తర్వాత టీమ్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో 90 దశకంలో ఒక వెలుగువెలిగిన దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా ఇపుడు జట్టులో ఉన్నా తాము గెలిచేవాళ్లం కాదని అన్నాడు. 1994లో మొహాలీలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రియాన్ లారా 91 పరుగులు చేసినా డ్రా అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ‘నెం బర్ వన్ టీమ్‌తో మేము ఆడుతున్నాం. 1994 నుంచి ఇప్పటివరకు భారత గడ్డపై తాము ఆడిన ఏ టెస్టులోనూ విజయం సాధించలేకపోయాం’ అని జాసన్ హోల్డర్ అన్నాడు. గత పదేళ్లుగా వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తాము సరిగా రాణించలేకపోతున్నామని పేర్కొన్నాడు. అయితే, 2004లో జరిగిన ఐసీసీ 50 ఓవర్ల చాంపియన్ ట్రోఫీలో అద్భుత ఆటతీరుతో కప్‌ను కైవసం చేసుకున్నామని అన్నాడు.
2019 వరల్డ్ కప్‌లో గేల్ ఆడతాడు
ఆరోగ్యం సహకరిస్తే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో తమ జట్టు సీనియర్ ఆటగాడు క్రిస్ గేల్ ఆడతాడని వెస్టిండీస్ కెప్టెన్ జాన్ హోల్డర్ అన్నాడు. జట్టులోకి గేల్ రాకను తాము సంపూర్ణంగా స్వాగతిస్తామని, ఫిట్నెస్‌పరంగా పూర్తిగా కోలుకుని జట్టులోకి పునరాగమనం చేయడం ద్వారా మళ్లీ ఆటలో తన సహజమైన దూకుడుతో కూడిన ఆటతీరుతో అలరిస్తాడని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.