క్రీడాభూమి

వెస్టిండీస్‌తో వనే్డ సిరీస్‌కు కోహ్లీ, ధోనీ డౌటే?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడతారా? లేదా? అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. వరుస మ్యాచ్‌లతో భారం ఎక్కువ కావడంతో కోహ్లీకి సిరీస్ మొత్తానికే విశ్రాంతి ఇస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధోనీ ఇటీవల ఆడిన పలు మ్యాచ్‌లలో వికెట్ కీపర్‌గా రాణిస్తున్నా ఆశించిన రీతిలో బ్యాట్స్‌మన్‌గా పరుగులు సాధించడంలో విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరిగే వనే్డలు, టీ-20 సిరీస్‌లకు ధోనీని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో 92 పరుగులతో అద్భుతంగా రాణించి, తృటిలో సెంచరీ మిస్సయిన రిషబ్ పంత్‌ను ధోనీ స్థానంలో సెలక్టర్లు జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినవస్తున్నాయి. అయితే, గురువారం నుంచి హైదరాబాద్‌లో జరిగే రెండో టెస్టు తర్వాతే కోహ్లీ, ధోనీ, రిషబ్ పంత్ వంటి వారి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘వచ్చే వరల్డ్ కప్ వరకు ధోనీ తప్పనిసరిగా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని మాకు తెలుసు. అలాగని ఇప్పుడిప్పుడే బ్యాటింగ్‌లో రాణిస్తున్న రిషబ్ పంత్ వంటివారికి అన్యాయం జరుగబోదు. అతను మైదానంలో నెంబర్ 6 లేదా నెంబర్ 7 బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగానా ఆటను పూర్తి చేయగల సత్తా ఉన్నవాడు’ అని బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ అధికారి పీటీఐ ప్రతినిధికి తెలిపాడు. ఓవల్‌లో జరిగిన టెస్టుమ్యాచ్‌లో ఆరంగేట్రం చేసిన రిషబ్ పంత్ రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 92 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. అదేవిధంగా దినేష్ కార్తీక్, కేదార్ జాదవ్ వంటివారి ఆటతీరు పట్ల టీమ్ మేనేజిమెంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వనే్డ సిరీస్, టీ-20 సిరీస్‌లకు వీరిని జట్టులోకి తీసుకునే అంశం అనుమానమే. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన అంబటి రాయుడు, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వనే్డ సిరీస్‌లో చోటుదక్కించుకునే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.