క్రీడాభూమి

వరల్డ్ కప్ హాకీకి సునీల్ అనుమానమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, అక్టోబర్ 11: వచ్చేనెల జరిగే వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్‌కు స్టార్ స్ట్రయికర్ అందుబాటులో ఉండేమోనన్న అనుమానం భారత శిబిరాన్ని ఆందోళనకు గురి చేస్తన్నది. ఇక్కడ జరుగుతున్న శిక్షణా శిబిరంలో ప్రాక్టీస్ చేస్తూ ఈనెల 4న గాయపడిన సునీల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఎడమ మోకాలికి గాయమైందని, కనీసం ఐదు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించడంతో, ఈలోగా అతను కోలుకొని వరల్డ్ కప్‌లో ఆడడం అనుమానంగానే కనిపిస్తున్నది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకూ భువనేశ్వర్‌లోనే జరిగే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌కు ఇక్కడ ప్రాక్టీస్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నారు. ప్రాక్టీస్ సమయంలోనే పొరపాటున కిందపడిన సునీల్ మోకాలికి దెబ్బ తగిలింది. గాయాన్ని లెటరల్ కొల్లేటరల్ లిజమెంట్ ఇంజురీ (ఎల్‌సీఎల్)గా గుర్తించినట్టు ఎంఆర్‌ఐ రిపోర్టును పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. కాగా, గురువారం సునీల్‌ను ఢిల్లీకి పంపామని, అక్కడ వైద్య పరీక్షల అనంతరం అతను వరల్డ్ కప్ ప్రారంభం నాటికి కోలుకుంటాడా? లేదా? అన్నది స్పష్టమవుతుందని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్యానెల్ వైద్యుడు బీకే నాయక్ తెలిపాడు. సునీల్ త్వరగానే కోలుకుంటాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు.