క్రీడాభూమి

షాను ఎదగనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 11: యువ సంచలనం పృథ్వీ షాను స్వేచ్ఛగా ఎదగనివ్వాలని, ఎవరితోనూ పోల్చవద్దని క్రికెట్ విశే్లషకులు, అభిమానులు, మీడియా ప్రతినిధులకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, గురువారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో అతను విలేఖరులతో మాట్లాడుతూ షాను సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్ వంటి దిగ్గజాలతో పదోలుస్తున్నారని, నిజానికి ఇది సరికాదని వ్యాఖ్యానించాడు. రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టుతోనే షా ఈ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి టెస్టులోనే అతను 154 బంతులు ఎదుర్కొని, 134 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. భారత్ తరఫున, కెరీర్‌లో మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. అతని ఆటను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. విశే్లషకులు అతనిని సచిన్, సెవాగ్ తదితరులతో పోల్చారు. అయితే, ఈ వైఖరిని కోహ్లీ తప్పుపట్టాడు. ఇప్పటి నుంచే లెజెండరీ క్రికెటర్లతో పోలిస్తే షాపై ఒత్తిడి పెరుగుతుందని, అతనికి స్వేచ్ఛగా ఎదిగే అవకాశం ఉందని కోహ్లీ అన్నాడు. ఏ విషయాన్నయినా షా వేగంగా నేర్చుకుంటాడని, సామర్థ్యం, ఉత్సాహం కలబోసిన ఆటగాడని ప్రశంసించాడు. సెవాగ్‌తో షాను పోల్చడాన్ని మానుకోవాలని గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ సమర్థించాడు. పోలిక అనేది యువ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడమే అవుతుందన్నాడు. ఐపీఎల్, 3ఏ2 టూర్లు, అండర్-19 టోర్నమెంట్స్ ప్రత్యక్ష ప్రసారాలు వంటి అంశాలు యువ ఆటగాళ్లను ఒక్కసారిగా స్టార్లను చేస్తున్నాయని, అందరి దృష్టినీ వారు ఆకర్షిస్తున్నారని, ఈ టోర్నమెంట్లు వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ఒత్తిడిని సమర్థంగా తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతున్నాయని వచ్చిన వాదనతో కోహ్లీ ఏకీభవించాడు. ఒక రకంగా నిజమేనని, అయితే, దేశానికి ప్రాతినిథ్యం వహించడం అనేది ఆషామాషీ కాదని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు, జాతీయ జట్టు టోపీని అందుకున్న వెంటనే సదరు ఆటగాడు ఎంతటి ఒత్తిడికి లోనవుతాడో తనకు తెలుసునని అన్నాడు. తెలుగు తేజం హనుమ విహారిని సమర్థుడైన ఆటగాడిగా కొనియాడాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందన్నాడు. వెస్టిండీస్‌ను తక్కువ అంచనా వేయడం లేదని, రెండో టెస్టులో విజయానికి సర్వశక్తులు ఒడ్డుతామని స్పష్టం చేశాడు.