క్రీడాభూమి

నెంబర్-1కు చేరువగా జొకోవిచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 15: ఏటీపీ తాజాగా ప్రకటించిన పురుషుల ర్యాంకింగ్స్‌లో నవోక్ జొకోవిచ్ ప్రపంచ నెంబర్ వన్ రాఫెల్ నాదల్‌కు చేరువయ్యాడు. షాంఘ్‌హై మాస్టర్ టైటిల్‌లో విజేతగా నిలిచిన జొకోవిచ్ త్వరలో (215 పాయింట్లు సాధిస్తే) ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. ఆదివారం జరిగిన షాంఘ్‌హై మాస్టర్ టోర్నీలో బొర్నా కొరిక్‌ను 6-3, 6-4 తేడాతో ఓడించిన జొకోవిచ్ ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో 7445 (+1) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రాఫెల్ నాదల్ 7660 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రోజర్ ఫెదరర్ (6260), జువాన్ మార్టిన్ డెల్ పొట్రో (5860), అలెగ్జాండర్ జ్వెరెవ్ (5025), మారిన్ సిలిస్ (4185), డొమినిక్ థియెమ్ (3825), కెవిన్ ఆండర్సన్ (3775), గ్రిగర్ దిమిట్రోవ్ (3440) వరుస స్థానాల్లో నిలిచారు.
మహిళల్లో రెండో ఏడాదీ టాప్‌లో హలెప్
డబ్ల్యూటీఏ తాజాగా ప్రకటించిన మహిళల ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ రెండో ఏడాది కూడా నెంబర్ వన్ (7421 పాయింట్లు) స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఆమె షెన్‌జెన్ ఓపెన్, రోజర్స్ కప్, రోలాండ్ గారోస్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌తోపాటు రోమ్, సిన్‌సిన్నాటిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా టైటిళ్లు అందుకుంది. రెండో స్థానంలో కరొలినా వొజినియాకీ (6461), ఆంజెలిక్ కెర్బర్ (5400), నవొమి ఒసాకా (4740), కరొలినా ప్లిస్కోవా (4465), ఎలీనా స్విటోలినా (4350), పెట్రా క్విటోవా (4255), సొయేన్ స్టీఫెన్స్ (4022), జూలియా జార్జెస్ (3785) వరుస స్థానాల్లో నిలిచారు.