క్రీడాభూమి

లంకకు తాత్కాలిక ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్యునెడిన్, డిసెంబర్ 13: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచిన శ్రీలంకకు మ్యాచ్ నాలుగో రోజు, ఆదివారం తాత్కాలిక ఊరట లభించింది. వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివేయాల్సి రావడంతో, వికెట్ల పతనాన్ని వాయిదా వేసుకోగలిగింది. చివరి రోజైన సోమవారం కూడా వర్షం కురిస్తే, ఓటమి ప్రమాదం నుంచి లంక బయటపడుతుంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 431 పరుగులకు సమాధానంగా శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 171 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగోరోజు ఉదయం ఆటను కొనసాగించి, మూడు వికెట్లకు 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ అజేయ శతకంతో రాణించగా, బ్రెండన్ మెక్‌కలమ్ 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మార్టిన్ గుప్టిల్ (46) మూడో రోజు ఆటలోనే అవుట్‌కాగా, నాలుగో రోజున కేన్ విలియమ్‌సన్ (71), రాస్ టేలర్ (15) అవుటయ్యారు.
భారీ లక్ష్యం: తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ప్రత్యర్థి ముందు 405 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఇన్నింగ్స్‌లో లంక ఆడిన తీరు చూస్తే, రెండో ఇన్నింగ్స్‌లో ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపించింది. అందుకు తగినట్టుగానే రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక వరుసగా కుశాల్ మేండిస్ (46), కరుణరత్నే (29), ఉదర జయసుందర (3) వికెట్లు కోల్పోయింది. చండీమల్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ క్రీజ్‌లోకి దిగుతున్న సమయంలోనే భారీ వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. కొంత సేపు వేచి చూసిన తర్వాత, వాతావరణం ఆటకు అనువుగా లేదని ఫీల్డ్ అంపైర్లు ఆర్‌ఎ కెటిల్‌బరో, ఎన్‌జె లాంగ్ ప్రకటించి, మూడో రోజు ఆటను ముగించారు. మరో రోజు ఆట మిగిలి ఉండగా, శ్రీలంక విజయానికి ఇంకా 296 పరుగులు చేయాలి. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. న్యూజిలాండ్‌లోని వాతావరణం, పిచ్‌ల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ స్కోరు సాధించడం లంకకు అసాధ్యంగా కనిపిస్తున్నది. సోమవారం కూడా వర్షం పడి ఆటకు అంతరాయం ఏర్పడితేగానీ లంకకు ఓటమి నుంచి బయటపడే అవకాశాలు లేవు. ప్రస్తుతానికి మా త్రం మ్యాచ్‌ని డ్రా చేసుకోవడానికి లంక ప్రయత్నిస్తే, విజయం కోసం కి వీస్ పోరాడడం ఖాయం.

లండన్ క్లాసిక్ చెస్
కరౌనాతో ఆనంద్ గేమ్ డ్రా
లండన్, డిసెంబర్ 13: భారత గ్రాండ్ మాస్టర్, ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ లండన్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్‌లో అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఒక విజయం, మూడు పరాజయాల అనంతరం అతను ఎనిమిదో రౌండ్‌లో గేమ్‌ను ఫాబియానో కరౌనాతో డ్రా చేసుకున్నాడు. దీనితో అతని ఖాతాలో మొత్తం మూడు పాయింట్లు ఉండగా, అనీష్ గిరి ఐదు పాయింట్లతో, మాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సెన్ 4.5 పాయింట్లు సంపాదించి, లెవోన్ అరోనియన్, అలెక్సాండర్ గ్రిస్చుక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.