క్రీడాభూమి

ఐసీసీ ర్యాంకింగ్స్ కోహ్లీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: టెస్టు, వనే్డ ఇంటర్నేషనల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, యువ సంచలనాలు పృథ్వీ షా, రిషభ్ పంత్ మెరుగైన ఫలితాలను సంపాదించారు. అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించి, టైటిల్‌ను అందించిన పృథ్వీ షా తాను ఆడిన మొదటి టెస్టులోనే సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో అతను అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించి, శతకాన్ని నమోదు చేశాడు. భారత్ తరఫున తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన పృథ్వీ షాకు తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో 73వ స్థానం లభించింది. విండీస్‌పై 92 పరుగులు చేసిన రిషభ్ పంత్ 23 స్థానాలను మెరుగుపరచుకొని, 62వ స్థానానికి చేరాడు. కాగా, వనే్డ ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ 884 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ 4,397 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా (3,712), ఆస్ట్రేలియా (3,499) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. వనే్డ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ 6,607 పాయింట్లతో నంబర్ వన్‌గా నిలవగా, భారత్ 6,492 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (4,606) మూడో స్థానాన్ని ఆక్రమించింది. కాగా, టీ-20 ఫార్మాట్‌లో పాకిస్తాన్, భారత్, ఆస్ట్రేలియా జట్లు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి.
టెస్టు బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ 935 పా యింట్లతో నంబర్ వన్‌గా ఉన్నాడు. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్‌సన్ (న్యూజిలాం డ్) రెండు, మూడు స్థానాలను సంపాదించుకున్నారు. వనే్డ ఇంటర్నేషనల్స్‌లోనూ విరాట్ కో హ్లీ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రోహి త్ శర్మ, జో రూట్ (ఇంగ్లాండ్) వరుసగా రెం డు, మూడు స్థానాల్లో ఉన్నారు. టీ-20 విభాగంలో అరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), ఫకర్ జమాన్ (పాకిస్తా న్), లోకేష్ రాహుల్ (భారత్) మొ దటి మూడు స్థానాలను ఆక్రమించారు.
బౌలింగ్ విభాగానికి వస్తే, టెస్టుల్లో జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్), కాగిసో రబదా (దక్షిణాఫ్రికా), వెర్నన్ ఫిలాండ్ (దక్షిణాఫ్రికా) టాప్-3 పొజిషన్స్‌లో ఉన్నారు. వనే్డలో జస్‌ప్రీత్ బుమ్రా (భారత్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), కుల్దీప్ యాదవ్ (భారత్) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. అదే విధంగా టీ-20 ఫార్మాట్‌లో రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), షాదబ్ ఖాన్ (పాకిస్తాన్), ఇష్ సోధీ (న్యూజిలాండ్) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్స్‌లో షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), రవీంద్ర జడేజా (భారత్), జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) టెస్టు ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడు స్థానాలను ఆక్రమించారు. వనే్డల్లో రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్) టాప్-3గా నిలిచారు. టీ-20 ఫార్మాట్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), మహమ్మద్ నబీ (అ ఫ్గానిస్తాన్), షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్)కు వరుసగా మొదటి మూడు స్థానాలు దక్కాయి.